Home గాసిప్స్ రాజశేఖర్ చేయాల్సిన సినిమా సుమంత్ చేశాడు…అక్కడ బ్లాక్ బస్టర్…ఇక్కడ ఏమవుతుందో!

రాజశేఖర్ చేయాల్సిన సినిమా సుమంత్ చేశాడు…అక్కడ బ్లాక్ బస్టర్…ఇక్కడ ఏమవుతుందో!

0

ఒకరితో అనుకున్న సినిమాలు మరొకరితో చేయడం లాంటివి కామన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. డేట్స్ అడ్జస్ట్ కాకనో, ఇతర కారణాల వలనో ఒకరు చేయాలి అనుకున్న సినిమాలు అప్పుడప్పుడు వేరే వాళ్ళతో చేస్తూ ఉంటారు, లేటెస్ట్ గా అలాంటి అవకాశం సీనియర్ హీరో రాజశేఖర్ కి రాగా తను వద్దు అనుకున్న సినిమా ఫ్లాఫ్స్ లో ఉన్న మరో హీరో సుమంత్ చేశాడు. ఆ సినిమా నే కపటదారి అనే డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ…

రెండేళ్ళ క్రితం కన్నడ లో రిలీజ్ అయిన ఈ సినిమా కి రెస్పాన్స్ సాలిడ్ గా రాగా అక్కడ ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది, దాంతో రీమేక్ ఆఫర్స్ సాలిడ్ గా రాగా తెలుగు లో ఈ సినిమాను రాజశేఖర్ తో చేయాలనీ ట్రై చేశారు, కథ ఓకే చెప్పిన రాజశేఖర్ మళ్ళీ ఎందుకో…

నో చెప్పి సినిమా నుండి డ్రాప్ అవ్వగా తర్వాత వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న సుమంత్ ఈ సినిమా రీమేక్ చేయడానికి ఓకే చెప్పగా సినిమా కొంచం లేట్ గానే రూపొంది త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. కాగా ఈ సినిమా తమిళ్ లో కూడా రీమేక్ అవ్వగా…

తమిళ్ వర్షన్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా అక్కడ రెస్పాన్స్ బాగానే ఉన్నప్పటికీ కలెక్షన్స్ ఆశించిన మేర అయితే లేవని తెలుస్తుంది. తెలుగు లో ఇప్పుడు ముందు ఈ నెల 26 న రిలీజ్ అవ్వాల్సింది కానీ నితిన్ చెక్ మూవీ రిలీజ్ డేట్ ని ఆ రోజుకి షిఫ్ట్ చేయడంతో కపటదారి సినిమా రిలీజ్ డేట్ ని ఒక వారం ప్రీ పోన్ చేసి ఇప్పుడు ఈ నెల 19 న రిలీజ్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు. మంచి కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా…

కన్నడ లో తెచ్చుకున్న రేంజ్ టాక్ ని తెలుగు లో సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రిజల్ట్ నే దక్కించుకునే అవకాశం ఉంది, వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న సుమంత్ కూడా ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తానన్న నమ్మకంతో ఉన్నారు. మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది, సినిమా ఎంతవరకు మెప్పించగలుగుతుందో త్వర్లలోనే తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here