Home గాసిప్స్ ఆ 2 బ్లాక్ బస్టర్ మూవీ చేసి ఉంటే ఇప్పుడు రేంజ్ వేరేలా ఉండేది…సుమంత్!!

ఆ 2 బ్లాక్ బస్టర్ మూవీ చేసి ఉంటే ఇప్పుడు రేంజ్ వేరేలా ఉండేది…సుమంత్!!

0

మంచి స్టార్ బ్యాగ్రౌండ్ ఉండి మంచి స్టార్ట్ లభించినా కానీ కెరీర్ ని సరిగ్గా ప్లాన్ చేసుకోలేక పోయిన హీరోల్లో సుమంత్ కూడా ఒకరు, అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ తో హీరోగా మంచి స్టార్ట్ నే సొంతం చేసుకున్న సుమంత్ కి మొదట్లో మంచి అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని కాదు అనుకుని తనకి నచ్చిన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ రాగా అందులో కొన్ని సినిమాలు నిరాశ పరిచాయి. ఆ ఎఫెక్ట్ తన కెరీర్ పై…

తీవ్రంగా ఇంపాక్ట్ చూపి బాక్స్ ఆఫీస్ దగ్గర మార్కెట్ లేకుండా చేసింది. అడపాదడపా అప్పుడప్పుడు కొన్ని మంచి సినిమాలు పడినా కానీ అవేవి కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దాంతో సుమంత్ సినిమాలు అన్నా కూడా ఆడియన్స్ లో ఆశలు చాలా వరకు తగ్గిపోయాయి…

కానీ తన కెరీర్ లో వచ్చిన ఆఫర్స్ లో  2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లు చేసి ఉంటె ఇప్పుడు కెరీర్ మరో రేంజ్ లో ఉండేదని చెప్పుకొచ్చారు సుమంత్ చాలా సార్లు. కెరీర్ మొదట్లో నువ్వే కావాలి, తొలిప్రేమ సినిమాలు ముందు వెళ్ళింది సుమంత్ దగ్గరికే. కానీ ఎందుకనో వాటిని చేయలేదు…

ఈ విషయాన్నీ పలుసార్లు చెప్పుకొచ్చిన సుమంత్ వాటితో పాటు తన దగ్గరకి వచ్చిన మరో బ్లాక్ బస్టర్ మూవీ గురించి రీసెంట్ గా చెప్పారు. అది అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ మాస్ హిట్ అయిన దేశముదురు.. ఈ సినిమా అందరికన్నా ముందు ఆఫర్ నా దగ్గరికే వచ్చింది అని, కానీ కథ నాకు ఏమాత్రం సూట్ అవ్వదని నో చెప్పానని, కానీ ఆ కథకి అల్లు అర్జున్ సూట్ అయినట్లు మరెవరూ సూట్ అవ్వరని…

ఆ ఎనర్జీ, క్యారెక్టరైజేషన్ అల్లు అర్జున్ కి పెర్ఫెక్ట్ గా సూట్ అయ్యిందని, అది అల్లు అర్జున్ కే బెస్ట్ మూవీ అని, ఆ సినిమా కోల్పోవడంలో ఎలాంటి రీగ్రెట్ లేదని చెప్పుకొచ్చారు సుమంత్. ప్రస్తుతం ఓ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న సుమంత్ కొన్ని ఓటిటి కంటెంట్ లు చేసినా ఆశించిన రెస్పాన్స్ రావడం లేదు. ఇలాంటి టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్యూచర్ లో ఏ సినిమాతో అయినా డీసెంట్ కంబ్యాక్ ను అందుకుంటాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here