ఈ వీకెండ్ ఆడియన్స్ ముందుకు చాలానే చిన్న సినిమాలు రిలీజ్ అవ్వగా వాటిలో టీసర్ ట్రైలర్ తో ఆకట్టుకున్న సినిమాగా హర్ష చెముడు(Harsha Chemudu) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సుందరం మాస్టర్(Sundaram Master Review) ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ….
కథ పాయింట్ కి వస్తే….గవర్న్ మెంట్ టీచర్ అయిన హీరోని ఆ ఊరి MLA ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉన్న మిర్యాల మిట్ట ఏరియాకి పంపిస్తారు…ఇంతకీ హీరో అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటి..అక్కడికి వెళ్ళిన తర్వాత హీరో ఫేస్ చేసిన పరిస్థితులు ఏంటి ఆ తర్వాత కథ ఏమయింది అన్నది అసలు సిసలు కథ…
మొత్తం మీద పెర్ఫార్మెన్స్ పరంగా హర్ష చెముడు తన రోల్ వరకు బాగా న్యాయం చేశాడు, కొన్ని సీన్స్ లో బాగా నవ్వించాడు కూడా…. దివ్య శ్రీపద తన రోల్ వరకు బాగా మెప్పించగా మిగిలిన యాక్టర్స్ అందరూ తమ తమ రోల్స్ లో పర్వాలేదు అనిపించగా సంగీతం ఓకే అనిపించింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు పర్వాలేదు అనిపించినా…
సెకెండ్ ఆఫ్ కథ చాలా వరకు డ్రాగ్ అయ్యి ట్రాక్ తప్పింది… సినిమాటోగ్రఫీ బాగుండగా డైలాగ్స్ కూడా కొన్ని చోట్ల బాగా ఎలివేట్ అయ్యాయి… ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి…. డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్షన్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా కూడా చెప్పిన విధానం చాలా స్లో గా సహనానికి పరీక్ష పెట్టేలా చేశాడు….
అలాగే సినిమాలో ఫస్టాఫ్ కొంచం ఎంటర్ టైన్ మెంట్ పర్వాలేదు అనిపించగా సెకెండ్ ఆఫ్ మాత్రం డ్రాగ్ అవుతూ స్లో నరేషన్ తో ట్రాక్ తప్పింది. అలా కాకుండా కంప్లీట్ గా ఎంటర్ టైన్ మెంట్ వే లో కథని నడిపి ఉంటే బెటర్ గా ఉండేది…. మొత్తం మీద సినిమాలో పార్టు పార్టులుగా కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయినా కూడా…
మొత్తం మీద సినిమా మాత్రం డీసెంట్ స్టార్ట్ తర్వాత ట్రాక్ తప్పినట్లు అయింది అని చెప్పొచ్చు….పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కొంచం ఓపిక పట్టి చూస్తె సెకెండ్ ఆఫ్ డ్రాగ్ అయినా కూడా ఓవరాల్ గా ఓకే అనిపించేలా అనిపించవచ్చు… సినిమాకి ఫైనల్ గా మా రేటింగ్ 2.5 స్టార్స్….