మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎవరు వచ్చినా కానీ చాలా వరకు ఫ్యామిలీ లో ఉండే ఇతర హీరోల సపోర్ట్ అయితే ఎప్పుడూ ఉంటుంది, సినిమా లాంచ్ కి కానీ ఈవెంట్స్ కి కానీ ఇతర హీరోలు వచ్చి సినిమాను ప్రమోట్ చేస్తూ ఉంటారు, కానీ మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన లేటెస్ట్ మూవీ సూపర్ మచ్చి సినిమా ఎప్పుడో పూర్తీ అయినా కానీ రిలీజ్ కి నోచుకోలేదు…
ఎప్పటి నుండో ట్రై చేస్తున్నా కానీ ఎప్పటికప్పుడు అనుకోకుండా పరిస్థితుల వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా బంగార్రాజు, రౌడీ బాయ్స్, హీరో మూవీస్ కి పోటిగా రిలీజ్ కాబోతూ ఉండగా… సినిమాను అసలు పట్టించుకున్న వాళ్ళే లేరు…
మెగా హీరోలు ఇతర హీరోల సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు కానీ సూపర్ మచ్చిని అసలు పట్టించుకోలేదు, హీరో కళ్యాణ్ దేవ్ కూడా ఈ సినిమా విషయంలో సైలెంట్ గానే ఉండటం మేజర్ రీజన్ అనుకుంట… ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు మొత్తం మీద కేవలం…
160 కి పైగానే థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుండగా సినిమాని కొనడానికి పెద్దగా బయ్యర్లు ఆసక్తి చూపలేదట. దాంతో బిజినెస్ ఏమి జరగలేదు కానీ థార్డ్ పార్టీ బయర్స్ తో సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది, కానీ ఓవరాల్ గా బిజినెస్ వర్త్ 1.6-1.8 కోట్ల రేంజ్ లో ఉంటుంది అన్న టాక్ ట్రేడ్ లో ఉందని చెప్పాలి. ఆ లెక్కన సినిమా హిట్ అవ్వాలి అంటే…
2 కోట్లకు అటూ ఇటూగా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా బుకింగ్స్ ఆల్ రెడీ స్టార్ట్ అయినా పెద్దగా క్రేజ్ లేదు, బజ్ కూడా లేదు దాంతో టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ అవుతున్న ఈ సినిమా టాక్ ఒకవేళ పాజిటివ్ గా ఉంటే 20-25 లక్షల రేంజ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే ఇది కూడా కష్టమే అని చెప్పాలి.