Home న్యూస్ 2008 నాటి సినిమా…ఇప్పుడు 500 ఏంటి సామి…అరాచకం ఇదీ!

2008 నాటి సినిమా…ఇప్పుడు 500 ఏంటి సామి…అరాచకం ఇదీ!

0

తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో సూర్య(Suriya) కూడా ఒకరని చెప్పాలి. ఎప్పటి నుండో తెలుగు లో స్టడీగా మార్కెట్ ఉన్నా కూడా సరైన సినిమాలు పడక సూర్య మూవీస్ కి తెలుగు లో అనుకున్న రేంజ్ లో వసూళ్లు రావడం లేదు…

ఇలాంటి టైంలో సూర్య క్రేజ్ ఇక అయిపొయింది అని అనుకునే వాళ్ళు కూడా ఉన్న టైంలో ఎప్పుడో 2008 టైంలో రిలీజ్ అయిన సూర్య మూవీని ఇప్పుడు తెలుగు లో 15 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ చేస్తూ ఉండగా ఎక్స్ లెంట్ బజ్ తో దూసుకు పోతుంది ఈ సినిమా…

మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్(Surya Son Of Krishnan Re Release) సినిమాను తెలుగు లో ఈ శుక్రవారం రిలీజ్ చేస్తూ ఉండగా బుకింగ్స్ ను ఓపెన్ చేసిన మేజర్ సెంటర్స్ అన్నింటిలో మంచి బుకింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…

ఇప్పటి వరకు తెలుగు లో ఏకంగా 500 వరకు షోలను సొంతం చేసుకోవడం విశేషం. తెలుగు టాప్ స్టార్స్ కి మాత్రమే ఈ రేంజ్ లో షోలు సొంతం అవుతాయి. అలాంటిది ఫాంలో లేని సూర్య నటించిన 15 ఏళ్ల క్రితం నాటి సినిమా కి ఈ రేంజ్ లో షోలు…

తెలుగు రాష్ట్రాల్లో సొంతం అవ్వడం, అక్కడ నుండి డీసెంట్ లెవల్ లో ఆక్యుపెన్సీ ఉండటం, కొన్ని చోట్ల షోలు హౌస్ ఫుల్ గా నిలవడం విశేషం అని చెప్పాలి. ఇక రీ రిలీజ్ లో ఈ సినిమా మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here