టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట మూడు వారాలను పూర్తీ చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో వారంలో అడుగు పెట్టి కూడా థియేటర్స్ ని ఇప్పటికీ బాగానే హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తూ ఉండగా మరో పక్క సడెన్ ట్విస్ట్ ఇస్తూ ఇప్పుడు సినిమా డిజిటల్ లో రిలీజ్ అయింది.
సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ రేటుకి సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ లో సినిమా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన 3 వారాల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో సర్కారు వారి పాట రెంట్ పద్దతిలో డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. అంటే 199 రేటుతో సినిమాను డిజిటల్ లోనే హై క్వాలిటీలో….
ఫ్యామిలీతో కలిసి చూసుకోవచ్చు…. ఇలా ఒక 10 రోజుల పాటు రెంట్స్ తో ఉన్న తర్వాత ఆడియన్స్ ముందుకు అందరికీ అందుబాటులో ఉండేలా డైరెక్ట్ రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ సడెన్ ట్విస్ట్ ను ఎవ్వరూ అసలు ఊహించలేదు అనే చెప్పాలి. ఇక ఇక్కడ సినిమాకి ఎలాంటి వ్యూవర్ షిప్ లభిస్తుందో చూడాలి…