టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా సైరా నరసింహా రెడ్డి, మెగాస్టార్ పెర్ఫార్మెన్స్ కి అల్టిమేట్ రెస్పాన్స్ వచ్చినా కానీ ప్రేక్షకులు దేశభక్తి సినిమాలు అనుకున్న రేంజ్ లో చూడరు కాబట్టి ఆ ఇంపాక్ట్ వలన బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ ను అందుకోలేక పోయిన సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో తప్పితే మిగిలిన చోట్ల ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేక పోయింది.
ఇక టెలివిజన్ విషయానికి వస్తే రికార్డ్ స్థాయి లో సినిమా శాటిలైట్ రైట్స్ హక్కులను ఏకంగా 25 కోట్లకు కొన్న జెమినీ టీవీ కి సాలిడ్ షాక్ లు ఇస్తుంది ఈ సినిమా…. ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు సినిమా కి ఉన్న హైప్ అండ్ పెట్టిన రేటు దృశ్యా…
సాలిడ్ రేటింగ్ ను సొంతం చేసుకుంటుంది అనుకున్నా 11.8 రేటింగ్ తోనే సరి పెట్టుకుంది సైరా సినిమా, తర్వాత సెకెండ్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 7.27 రేటింగ్ ని సాధించగా ఇక సినిమా ఇలాంటి రేటింగ్స్ ని లాంగ్ రన్ లో అందుకుంటూ ఉంటేనే ఛానెల్ కి ప్రాఫిట్ అనుకుంటున్న టైం లో….
సినిమా స్లో డౌన్ అయ్యి మూడో సారి టెలికాస్ట్ అయినప్పుడు కేవలం 4.58 రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకుని నిరాశ పరచగా ఇప్పుడు రీసెంట్ గా 4 వ సారి టెలికాస్ట్ అయిన సినిమా కొంచం గ్రోత్ ని సాధించింది… 4.97 రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కొంచం పర్వాలేదు అనిపించింది కానీ ఇప్పటికీ సినిమా కి పెట్టిన రేటు దృశ్యా చూసుకుంటే…
ఈ రేటింగ్ లు పెద్దగా సరిపోవు అనే చెప్పాలి. లాంగ్ రన్ లో ఇలానే అనేక సార్లు సినిమా హోల్డ్ చేసి రేటింగ్ లను సాధిస్తేనే పెట్టిన 25 కోట్ల రేటు కి న్యాయం చేసే అవకాశం ఉంటుంది అని చెప్పాలి. మరి టెలివిజన్ లో సేఫ్ అవ్వాలి అంటే సినిమాకి మరెంత టైం పడుతుందో చూడాలి మరి.