Home న్యూస్ టాక్సీవాలా ఫస్ట్ డే కలెక్షన్స్…దుమ్ములేచిపోయింది

టాక్సీవాలా ఫస్ట్ డే కలెక్షన్స్…దుమ్ములేచిపోయింది

1

  గీత గోవిందం తో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ని కొట్టడమే కాకుండా మీడియం రేంజ్ మూవీస్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ టాక్సీవాల బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి ఆక్యుపెన్సీ తో మొదటి రెండు షోలు భారీగా దుమ్ము లేపాయి. ఇక ఓవర్సీస్ లో సినిమా ప్రీమియర్ షోల ద్వారా టోటల్ గా 1 లక్ష డాలర్స్ దాకా వసూల్ చేసినట్లు సమాచారం అందుతుంది.

ఇక సినిమా రెండు రాష్ట్రాలలో ఈవినింగ్ అండ్ నైట్ షోల కి కూడా జోరు చూపి అంచనాలను కొద్దిగా మించింది అనే చెప్పాలి. మొదటి రెండు షోల ఓపెనింగ్స్ ని చూసి 4 కోట్ల లోపు షేర్ వస్తుంది అనుకున్నా ఇప్పుడు మొదటి రోజు కలెక్షన్స్ లెక్క అంతకి మించి ఉండబోతుందని సమాచారం.

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా జోరు గా ఉండటం తో తొలిరోజు టాక్సీవాలా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 4 కోట్లకు మించి వసూళ్లు అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. పోటీ లో ఇది భారీ హోల్డ్ అనే చెప్పాలి. మరి అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here