టాలీవుడ్ సినిమాల మార్కెట్ సినిమా సినిమా కి పెరిగి పోతు వస్తుంది… బాహుబలి మొదటి పార్ట్ సృష్టించిన భీభత్సం తర్వాత 60-70 కోట్ల రేంజ్ లో బిజినెస్ లు జరుగు తుండగా బాహుబలి 2 బిగ్గెస్ట్ హిట్ తర్వాత బిజినెస్ రేంజ్ ఇప్పుడు 90 నుండి 100 ఆ పైనే జరుగు తూ వస్తుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసు కున్న టాప్ 8 సినిమాలు ఇవే
1. బాహుబలి 2: 350 కోట్లు
2. అజ్ఞాతవాసి : 125 కోట్లు
3. స్పైడర్: 124 కోట్లు
4. బాహుబలి 1: 117 కోట్లు
5. భరత్ అనే నేను: 100 కోట్లు
6. అరవింద సమేత: 90.4 కోట్లు
7. వినయ విధేయ రామ : 90 కోట్లు
8. ఖైదీనంబర్150: 89 కోట్లు
ఇవీ మొత్తం మీద అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకున్న సినిమాలు.
ఇవి ఇప్పటి వరకు తెలుగు లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ని సాధించిన తెలుగు సినిమాలు 2019 లో భారీ సినిమాలు ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అవుతున్న నేపద్యంలో కచ్చితంగా ఈ లెక్కలు మారే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. ఫస్టాఫ్ ని మించి సెకెండ్ ఆఫ్ లో కొన్ని క్రేజీ సినిమాలు ఉన్నాయి.
వాటి లో ముందుగా మహర్షి, తర్వాత సైరా నరసింహ రెడ్డి, సాహో, అల్లు అర్జున్ 19 వ సినిమా ముఖ్యంగా రేసు లో ముందు నిలిచే సినిమాలు అని చెప్పొచ్చు. ఇక తర్వాత ఇయర్ లో కూడా క్రేజీ సినిమా లు భారీ గా ఉండటం తో కచ్చితంగా ఈ లిస్టులో మార్పులు…
జరిగే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. మరి ఆ సినిమాలు ఏవి అవుతాయి అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.