Home న్యూస్ టెనెట్ రివ్యూ…..ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చూసి ఉండరు!!

టెనెట్ రివ్యూ…..ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చూసి ఉండరు!!

0

   8 నెలలుగా మూసేసి ఉన్న థియేటర్స్ రీ ఓపెన్ అవ్వగా ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే సినిమాల రిలీజ్ కోసం అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో 2020 హాలివుడ్ మోస్ట్ వాంటెడ్ మూవీ టెనెట్ ఇది వరకే ఓవర్సీస్ లో రిలీజ్ అవ్వగా ఇప్పుడు ఇండియా లో మరీ భారీగా కాకున్నా ఉన్నంతలో మంచి రిలీజ్ ని సొంతం చేసుకుంది, మరి సినిమా ఎలా ఉంది ఎలా ఆకట్టుకుంటుంది లాంటి విశేషాలు తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ ఏంటంటే…. విలన్స్ కొందరు కొన్ని బుల్లెట్స్ ని కనిపెడతారు, అవి ఇన్ వెర్స్ టైం ట్రావెల్ కి ఉపయోగపడతాయి, ఇది శత్రువుల దగ్గర ఉంటే వరల్డ్ వార్ 3 వస్తుంది అని ఒక స్పై తనకున్న వనరులతో ఎలా ఈ యుద్దాన్ని ఆపాడు అన్నది కథ…

మరో కథగా తల్లి కొడుకులను కలపడం కూడా మరో ముఖ్య కథగా ఉన్న టెనెట్ ఈ కథ చెప్పినా కానీ సినిమా చూస్తున్నప్పుడు ప్రతీ మూవ్ మెంట్ ని స్పష్టంగా గమనిస్తూ ఉంటేనే క్లైమాక్స్ లో కథ మొత్తం అర్ధం అయ్యి ఇది అసలు కథ అనిపిస్తుంది.

మొదటి నుండి సెకెండ్ ఆఫ్ వరకు కథ రకరకాల టర్న్ లు ట్విస్ట్ లు తీసుకుని ఆడియన్స్ కి ఎం అర్ధం కాదు అన్నట్లు అనిపించినా క్లైమాక్స్ లో అన్నీ ఒక్కొటిగా వివరిస్తూ ఆడియన్స్ కి అల్టిమేట్ గూస్ బంప్స్ తెప్పించాడు డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్… ఇలాంటి సినిమా లో నటించిన యాక్టర్స్ అందరూ కూడా అద్బుతంగా నటించి మెప్పించగా…

బాలీవుడ్ సీనియర్ నటి డింపుల్ కపాడియా కూడా తన రోల్ వరకు బాగా నటించింది, హీరో తో పాటు నెక్స్ట్ బ్యాట్ మన్ హీరో కూడా ఈక్వల్ రోల్ తో అదరగొట్టేశాడు… బ్యాగ్రౌండ్ స్కోర్ మరీ అద్బుతం కాదు కానీ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం బాగా కనెక్ట్ అయ్యేలా ఉందని చెప్పాలి…

ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ముందే చెప్పినట్లు చాలా కన్ఫ్యూజన్ గా సాగుతూ ఉంటుంది కానీ సెకెండ్ ఆఫ్ సగం తర్వాత ఒక్కొటిగా ముందు జరిగిన సీన్స్ అన్నింటికి కనెక్షన్ ని వివరిస్తూ క్లైమాక్స్ కి వచ్చే సరికి అద్బుతం అనిపించేలా చేస్తుంది…సినిమాలో కొత్తగా…

ఇన్ వెర్స్ ఆఫ్ టైం కొత్త కాన్సెప్ట్ ని వాడుకోగా అది అర్ధం అయ్యాక అద్బుతంలా అనిపిస్తుంది…ఇక హైలెట్స్ విషయానికి వస్తే చాలానే మెస్మరైజింగ్ మూమెంట్స్ ఉన్నప్పటికీ ఫైట్ క్రాష్ ఎపిసోడ్, రోడ్ రష్ ఎపిసోడ్, క్లైమాక్స్ ఎక్స్ లెంట్ అనిపించేలా ఉన్నాయని చెప్పొచ్చు..

ముందుగా చెప్పినట్లే ఒక్కో సీన్ ముందు కన్ఫ్యూజ్ చేసినా తర్వాత వాటి ఇంటర్ కనెక్షన్ సీన్స్ మైండ్ బ్లాంక్ చేస్తాయి… ఇలా క్రిస్టఫర్ నోలన్ టైం తో ఒక ఆట ఆడుకున్నాడు అని చెప్పాలి. మీరు సినిమా చూడాలి అని ఫిక్స్ అయితే తెలుగు డబ్బింగ్ కి ముందు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది….

ఇంగ్లీష్ లో చూసినా పర్వాలేదు కానీ కొంత భాగం చాలా లెంతీ డైలాగ్స్ చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళుతూ అర్ధం అవ్వడానికి టైం పడుతుంది, సబ్ టైటిల్స్ ఉన్న థియేటర్స్ కి వెళ్లి చూస్తె మరింత బెటర్… ఓవరాల్ గా క్రిస్టఫర్ నోలన్ డైరెక్షన్ లో ఇది వరకు వచ్చిన ఇంసెప్షన్, ఇంటర్ స్టెల్లార్ లాంటి మూవీస్ తో…

పోలిస్తే మరీ అద్బుతం కాదు కానీ ఉన్నంతలో మరో డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ఎవ్వరూ ఊహించని అల్టిమేట్ సీన్స్ అండ్ కాన్సెప్ట్ తో క్రిస్టఫర్ నోలన్ మరోసారి ఆకట్టుకున్నాడు అనే చెప్పాలి. నోలన్ ఫ్యాన్స్ కి మరో మంచి సినిమా టెనెట్….రెగ్యులర్ ఆడియన్స్ ఇలాంటి కాన్సెప్ట్ మూవీ ఇప్పటి వరకు చూసి ఉండరు. సినిమా కి మా రేటింగ్ 3.25 స్టార్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here