Home న్యూస్ డిసాస్టర్ రివ్యూలు….అయినా 18 రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ తో షాహిద్ కపూర్ మాస్ రచ్చ!

డిసాస్టర్ రివ్యూలు….అయినా 18 రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ తో షాహిద్ కపూర్ మాస్ రచ్చ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో ఈ ఇయర్ మరీ భారీ బ్లాక్ బస్టర్స్ అయితే సొంతం అవ్వలేదు కానీ ఉన్నంతలో మిక్సుడ్ టాక్ తో కూడా మంచి కలెక్షన్స్ నే సినిమాలు సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా రీసెంట్ గా షాహిద్ కపూర్(Shahid Kapoor) హీరోగా నటించిన కొత్త సినిమా….

 తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా(Teri Baaton Mein Aisa Uljha Jiya) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి డిసాస్టర్ రివ్యూలను సొంతం చేసుకోగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా వాషౌట్ అవుతుంది అనుకున్న సినిమా డిసాస్టర్ రివ్యూలతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా హోల్డ్ చేస్తూ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా….

మూడో వీకెండ్ కంప్లీట్ చేసుకునే టైంకి 130 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకుని మంచి జోరునే చూపించింది. ఇండియాలో మూడో వీకెండ్ కంప్లీట్ అయ్యి 18 రోజులు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా 75 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకోగా టోటల్ ఇండియా గ్రాస్ 90 కోట్ల రేంజ్ లో ఉండగా….

ఓవర్సీస్ మొత్తం మీద సినిమా 39 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా 18 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 129 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకోగా ఇప్పటికీ స్టడీ గా రన్ ని కొనసాగిస్తున్న సినిమా ఫైనల్ రన్ లో 150 కోట్ల దాకా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఇండియాలో సినిమా అటూ ఇటూగా 80 కోట్ల రేంజ్ లో…

నెట్ కలెక్షన్స్ ని అందుకుంటే హిట్ అనిపించుకునే అవకాశం ఉండగా సినిమా లాంగ్ రన్ లో ఈ మార్క్ ని అందుకుని హిట్ గా నిలిచే అవకాశం ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద డిసాస్టర్ రివ్యూలతో కూడా షాహిద్ కపూర్ ఈ సినిమాతో మాస్ రచ్చ చేశాడని చెప్పొచ్చు బాక్స్ ఆఫీస్ దగ్గర….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here