Home న్యూస్ నాగ చైతన్య తండెల్ టీసర్ రివ్యూ….మాస్….సాలిడ్ కంబ్యాక్ పక్కా!

నాగ చైతన్య తండెల్ టీసర్ రివ్యూ….మాస్….సాలిడ్ కంబ్యాక్ పక్కా!

0

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) రీసెంట్ టైంలో ఫామ్ లో లేని విషయం తెలిసిందే. థాంక్ యు, కస్టడీ లాంటి ఫ్లాఫ్ మూవీస్ ఇంపాక్ట్ తర్వాత నాగ చైతన్య చేస్తున్న కొత్త సినిమా తండెల్(Thandel Movie) చందు మొండేటి డైరెక్ట్ చేస్తూ ఉండగా సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి(Sai Pallavi) నటిస్తూ ఉండగా…

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. టీసర్ లో ఫస్టాఫ్ మొత్తం నాగ చైతన్య ఊరమాస్ రోల్ అదుర్స్ అనిపించగా దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఓ రేంజ్ లో కుమ్మేసింది. ఇక సెకెండ్ ఆఫ్ కథని పాకిస్థాన్ లో ఇరుకున్న ఇండియన్ జాలరీ అయిన హీరో…

తను ప్రేమించిన అమ్మాయి సాయి పల్లవితో తిరిగి కలిశాడా లేదా అన్న కథతో తెరకెక్కిన సినిమాగా తండెల్ టీసర్ చూస్తె కథ అర్ధం అవుతుంది. విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాట్చ్ అనిపించేలా ఉండగా నాగ చైతన్య రగ్గుడ్ మాస్ లుక్ బాగా మెప్పించింది, టీసర్ ఎండ్ లో సాయి పల్లవి లుక్ కూడా మెప్పించగా…

ఓవరాల్ గా తండెల్ టీసర్ అంచనాలను చాలా వరకు పెంచేసేలా ఉందని చెప్పాలి. ఈ ఇయర్ లోనే రాబోతున్న ఈ సినిమా ఏమాత్రం టాక్ పాజిటివ్ గా ఉన్నా కూడా నాగ చైతన్యకి సాలిడ్ కంబ్యాక్ మూవీ అవ్వడమే కాదు కెరీర్ లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక ఈ టీసర్ కి 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here