Home న్యూస్ అయలాన్ ట్రైలర్ రివ్యూ…కుమ్మింది ట్రైలర్….హిట్టు మూవీ!!

అయలాన్ ట్రైలర్ రివ్యూ…కుమ్మింది ట్రైలర్….హిట్టు మూవీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంక్రాంతికి తెలుగు లో భారీ పోటి ఏర్పడగా డబ్బింగ్ మూవీస్ రిలీజ్ కి చాలా కష్టాలు ఉండగా తమిళ్ లో మాత్రం 2 క్రేజీ సినిమాలు ఇప్పుడు పోటిలో రిలీజ్ కానున్నాయి. అందులో ఒకటి శివ కార్తికేయన్(Siva Karthikeyan) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అయలాన్(Ayalaan Movie) రిలీజ్ కాబోతూ ఉండగా…

చిన్న పిల్లను సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇష్టపడే ఎలియన్స్ కాన్సెప్ట్ తో వస్తున్న అయలాన్ మూవీ గ్రాఫిక్స్ అండ్ క్వాలిటీ పరంగా చాలా బాగానే మెప్పించింది అని చెప్పాలి ఇప్పుడు… ట్రైలర్ లో సినిమా మెయిన్ కథని కూడా రివీల్ చేశారు. ప్రకృతిని, యానిమల్స్ ని ఇష్టపడే హీరో, ప్రకృతిలో ఉన్న ఒక విశిష్ట వస్తువు కోసం వెతుకుతున్న విలన్…

అనుకోకుండా భూమి మీదకి వచ్చిన ఏలియన్ హీరో దగ్గరకు వస్తుంది, ఆ ఏలియన్ ఎందుకు వచ్చింది ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా అసలు కథగా అనిపిస్తూ ఉండగా ట్రైలర్ మొత్తం మీద ఎంటర్ టైన్ మెంట్ తో పాటు క్వాలిటీ అండ్ గ్రాఫిక్స్ చాలా బాగా మెప్పించేలా ఉండటం విశేషం అని చెప్పాలి.

డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ని ఎంచుకుని సక్సెస్ లను సొంతం చేసుకునే శివ కార్తికేయన్ మరోసారి డిఫెరెంట్ స్టోరీ తో అలియాన్ తో మెప్పించే అవకాశం ఎంతైనా ఉండగా సంక్రాంతికి తెలుగు లో రిలీజ్ దొరకడం కొంచం కష్టంగా కనిపిస్తూ ఉండగా మేకర్స్ ఎన్ని స్క్రీన్స్ దొరికితే అన్ని స్క్రీన్స్ లో సినిమాను రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు…

పోటిలో కాకుండా సోలోగా రిలీజ్ అయితే సినిమా తెలుగు లో కూడా ఆడియన్స్ ను మెప్పించే అవకాశం ఉందని ట్రైలర్ చూస్తె అనిపిస్తుంది. మరి మేకర్స్ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక ఈ సినిమాతో శివ కార్తికేయన్ ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here