బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అవుతున్న సినిమాల్లో భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా ది లెజెండ్… తమిళనాడులో శరవణన్ స్టోర్స్ ఓనర్ అయిన శరవణన్ హీరోగా లాంచ్ అవుతున్న సినిమా ది లెజెండ్…. ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ఇలా రిలీజ్ అయిన అన్ని కూడా క్వాలిటీ పరంగా ఆకట్టుకున్నా కానీ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాయి… అలా పబ్లిసిటీని సొంతం చేసుకుంటున్న ఈ సినిమా….
తమిళ్ తో పాటు, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ ఇలా అన్ని భాషల్లో పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతుందని సమాచారం. అది కూడా ఏకంగా 2500 వరకు థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా…..
బడ్జెట్ పరంగా ట్రేడ్ కి మైండ్ బ్లాంక్ చేసేలా ఆల్ మోస్ట్ 45 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా అని అంటున్నారు. ఈ రేంజ్ బడ్జెట్ మీడియం రేంజ్ హీరోలకు కూడా తక్కువగానే పెడుతూ ఉంటారు. అలాంటిది తానె హీరోగా శరవణన్ ఫస్ట్ మూవీ కే ఏకంగా 45 కోట్ల రేంజ్ భారీ బడ్జెట్ తో…
ఈ సినిమాను రూపొందించగా ఈ వీకెండ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఈ రేంజ్ బడ్జెట్ ను రికవరీ చేస్తుందో లేదో అన్న డౌట్స్ నెలకొనగా నాన్ థియేట్రికల్ రైట్స్ తో కొద్ది వరకు రికవరీ అయ్యిందని అంటున్నారు. త్వరలో ఆ డీటైల్స్ బయటికి రానున్నాయి. మరి బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.