ఒకప్పటిలా తెలుగు సినిమాలు 100, 125, 150, 200 ఇలా ఎక్కువ రోజులు ఆడే టైం అయిపొయింది. అప్పట్లో సినిమాల హిట్స్ ని ఎన్ని రోజులు ఆడాయి అన్న దాని మీద ఏ రేంజ్ సక్సెస్ అన్నది చెబుతూ ఉంటారు…కానీ ఇప్పుడు ఎన్ని తక్కువ రోజుల్లో ఎంత కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది అన్నది డిపెండ్ అయ్యి ఉంటుంది… చాలా కొన్ని సినిమాలు మాత్రమే…
బాక్స్ ఆఫీస్ దగ్గర 50 రోజులు ఆ పైన కంప్లీట్ చేసుకుంటూ ఉండగా రీసెంట్ టైంలో ఏ సినిమా సాధించని రేంజ్ లో నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా ఒక సంచలన రికార్డ్ ను నమోదు చేసింది….ఏకంగా 200 రోజులను ఒక థియేటర్ లో కంప్లీట్ చేసుకుంది…
ఆంధ్ర ప్రదేశ్ లో చిలకలూరి పేట రామకృష్ణ థియేటర్ లో రోజుకి 4 ఆటలు ప్రదర్శితం అవుతూ ఇప్పుడు 200 రోజులను కంప్లీట్ చేసుకుని సంచలనం సృష్టించగా చిలకలూరి పేట ఏరియాలో హిస్టరీలో రెండో సారి 200 రోజులను రోజుకి 4 షోలతో కంప్లీట్ చేసుకున్న సినిమాగా నిలిచింది…
ఇది వరకు 2006 టైంలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన పోకిరి(Pokiri Movie) ఇక్కడ 200 రోజులను 4 షోలతో కంప్లీట్ చేసుకుని సంచలనం సృష్టించగా ఆల్ మోస్ట్ ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడ భగవంత్ కేసరి 200 రోజులను కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా ఇప్పటికీ…
రోజుకి 4 షోలతో పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అప్పట్లో అంటే ఇలాంటి రికార్డులు కామన్ కానీ ఈ టైంలో భగవంత్ కేసరి సినిమా 200 రోజులను పూర్తి చేసుకుని 225 రోజుల వైపు ఇక్కడ కొనసాగుతూ ఉండటం నిజంగానే ఈ ఏరియాలో హిస్టారికల్ రికార్డ్ ను నమోదు చేసింది అని చెప్పాలి.