Home న్యూస్ ఎన్ని కోట్ల ఆఫర్ ఇచ్చినా…ఈ రెండు సినిమాలు అమ్మం!!

ఎన్ని కోట్ల ఆఫర్ ఇచ్చినా…ఈ రెండు సినిమాలు అమ్మం!!

0

కరోనా ఎఫెక్ట్ తో వరుస పెట్టి సినిమా లు థియేటర్ రిలీజ్ ని ఆపేసి ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. మొదట్లో అందరూ ఈ పద్దతి పై వ్యతిరేకత ని చూపినా కానీ ప్రస్తుత పరిస్థితులను గమనించి ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ కన్నా కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ బెటర్ అని భావించి మంచి ఆఫర్ వచ్చిన వెంటనే సినిమా లను అమ్మేయడం మొదలు పెట్టిన విషయం అందరి కీ తెలిసిందే.

ఇక రీసెంట్ గా అయితే ఏకంగా 7 కొత్త బాలీవుడ్ సినిమా లు డైరక్ట్ డిజిటల్ రిలీజ్ ని కన్ఫాం చేసుకోగా అందులో అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్, అజయ్ దేవగన్ భుజ్ మరియు సుశాంత్ లాస్ట్ మూవీ దిల్ బెచారా లాంటి క్రేజీ సినిమాలు కూడా ఉన్నాయి.

ఈ పాత్ బ్రేకింగ్ నిర్ణయం తో ఇతర సినిమా లు కూడా ఈ లిస్టులో నిలుస్తాయి అనుకున్నా ఓ రెండు మూడు సినిమాలు మాత్రం నో చెబుతున్నాయి. వాటిలో అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ సినిమా అలాగే రణవీర్ సింగ్ నటించిన 83 వరల్డ్ కప్ సినిమా లు ముందు నిలిచాయి అని చెప్పాలి.

ఈ రెండు సినిమాలకు కూడా అత్యంత భారీ ఆఫర్స్ వచ్చినా కానీ రెండు సినిమాల నిర్మాతలు మాత్రం మిగిలిన సినిమాల విషయం మాత్రం వేరేని ఈ రెండు సినిమాలు పరిస్థితి చక్కదిద్దుకున్నాక థియేటర్స్ లోనే చూసి తీరాల్సిన సినిమా లలో ముందు నిలిచే సినిమాలు అని, అందుకే ఎన్ని కోట్ల ఆఫర్ ఇచ్చినా కానీ ఈ రెండు సినిమాలను మాత్రం…

ఎట్టి పరిస్థితులలో కూడా డిజిటల్ రిలీజ్ చేయం అని కన్ఫాం చేశారు. అన్ని సినిమాలు ఇలా డిజిటల్ లో రిలీజ్ చేస్తూ పొతే… పరిస్థితులు చక్కదిద్దుకున్నాక థియేటర్స్ లో చూడటానికి సినిమాలు ఉండవని అందుకే ఈ కొన్ని సినిమాలను మాత్రం అలాగే థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని చెబుతున్నారు వారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here