బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా సెకెండ్ పాండమిక్ తర్వాత రిలీజ్ అయిన మూవీస్ లో ఏవి కూడా యునానిమస్ హిట్ టాక్ ని ఏమి సొంతం చేసుకోలేదు, ఉన్నంతలో ఒక్క రాజ రాజ చోర మాత్రమె మంచి టాక్ ని సొంతం చేసుకోగా మిగిలిన సినిమాల్లో మిక్సుడ్ రెస్పాన్స్ తో మంచి సక్సెస్ గా నిలిచిన సినిమాగా SR కళ్యాణ మండపం సినిమా నిలిచింది, కానీ తర్వాత వచ్చిన సినిమాల్లో…
విశ్వక్ సేన్ పాగల్ కానీ ఇటు సుధీర్ బాబు నటించిన శ్రీదేవి సోడా సెంటర్ కానీ అటూ ఇటూగా మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. కానీ రెండు సినిమాల్లో విశ్వక్ సేన్ పాగల్ సినిమా వీకెండ్ తర్వాత కంప్లీట్ గా స్లో అవుతుంది అనుకున్నా కానీ…
విశ్వక్ సేన్ ఓటమి ఒప్పుకోకుండా వీలు దొరికిన ప్రతీ చోట సినిమాను ప్రమోట్ చేశాడు… దాని ఫలితం సినిమా కి టాక్ ఎలా ఉన్నా తర్వాత వర్కింగ్ డేస్ అండ్ కొత్త సినిమాల పోటి వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్స్ అయితే సొంతం అయ్యాయి. ఆ విషయం లో…
పాగల్ టీం సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. కానీ చివరి గీతని అందుకోలేదు. ఇదే విధంగా లేటెస్ట్ గా వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్ ను కూడా హీరో సుధీర్ బాబు ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు, కానీ వీకెండ్ తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ పరిస్థితి దారుణంగా మారిపోయింది ఇప్పుడు… మినిమం కలెక్షన్స్ కూడా రాక పోవడం బిజినెస్ ఎక్కువ జరగడంతో ఇప్పుడు ఓవరాల్ గా…
సినిమా వల్ల భారీ నష్టాలు కొన్న వాళ్ళకి రావడం ఖాయంగా కనిపిస్తుంది… పాగల్ సినిమా విషయం లో ప్రమోషన్స్ పని చేశాయి కానీ ఎందుకో శ్రీదేవి సోడా సెంటర్ విసయంలో కొంచం బెటర్ టాక్ ఉన్నప్పటికీ, ఏకంగా మహేష్ బాబు లాంటి స్టార్ ప్రమోట్ చేసినప్పటికీ జనాలు ఎందుకనో అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి రాకపోవడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు డిసాస్టర్ గా నిలవడం ఖాయం అయ్యింది.