Home గాసిప్స్ టైర్ 2 హీరోల సినిమాలకు చుక్కలు కనిపిస్తున్నాయిగా!

టైర్ 2 హీరోల సినిమాలకు చుక్కలు కనిపిస్తున్నాయిగా!

0

టాలీవుడ్ టాప్ స్టార్ హీరోల మార్కెట్ రేంజ్ ఈజీగా టాక్ బాగుంటే 100 కోట్లు ఇప్పుడు అందుకోవడం పెద్ద కష్టం కాదు, ఇది వరకు ఇది 70-75 కోట్ల రేంజ్ లో ఉండేది, కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. ఇది వరకు టాలీవుడ్ టైర్2 హీరోల సినిమాల రేంజ్ 40 కోట్ల దాకా ఉండేది, కానీ ఇప్పుడు టాక్ బాగుంటే 50-60 కోట్ల రేంజ్ దాకా ఉండే అవకాశం ఉంది.

కానీ అదే టైంలో టాక్ ఏమాత్రం తేడా కొట్టినా కూడా టాప్ స్టార్ మూవీస్ కన్నా కూడా భారీ నష్టాలు మీడియం రేంజ్ మూవీస్ కి వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం సినిమాల బడ్జెట్ లు భారీగా పెరిగిపోవడం, హీరోల రెమ్యునరేషన్ లు కూడా భారీగా పెరిగిపోవడం అని చెప్పొచ్చు… కానీ టైర్2 హీరోల సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర…

నష్టాలు వచ్చినా మేకర్స్ భారీ బడ్జెట్ పెట్టడానికి సిద్ధం అవ్వడానికి కారణం ఆ సినిమాలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ లు బాగా జరగడమే. కానీ రీసెంట్ టైంలో ఇది మరీ ఓవర్ అయిపోయి OTT వాళ్ళకి కూడా భారీగా వ్యూవర్ షిప్ పడిపోయి నష్టాలు వస్తూ ఉండటంతో ప్రస్తుతం ప్రొడక్షన్ లో ఉన్నా చాలా మీడియం రేంజ్ మూవీస్ రైట్స్ అస్సలు అమ్ముడుపోవడం లేదట…

ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఒకటి రెండు సినిమాలు తప్పితే చాలా సినిమాల నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోక పోవడం మునుపటిలా మీడియం రేంజ్ హీరోల సినిమాలు వరుస పెట్టి రిలీజ్ లను సొంతం చేసుకోవడం లేదని టాలీవుడ్ లో స్ట్రాంగ్ గా బజ్ ఉంది…. ఇది వరకు నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోకపోయినా కూడా…

సినిమా మీద నమ్మకంతో రిలీజ్ చేసి హిట్ అయితే అనుకున్న రేంజ్ కి ఎక్కువ రేటుని సొంతం చేసుకున్న సినిమాలు ఉన్నాయి కానీ ఇప్పుడు బడ్జెట్ మరీ ఔట్ ఆఫ్ కంట్రోల్ అవ్వడంతో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాకే రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేయాలనీ చాలా మంది నిర్మాతలు అనుకుంటున్నారట.

దాంతో ఒకప్పుడు సేఫ్ జోన్ లో ఉండే మీడియం రేంజ్ మూవీస్ కి ఇప్పుడు ఓవర్ బడ్జెట్ అండ్ ఓవర్ రెమ్యునరేషన్ ల వలన సరైన రేట్లు సొంతం అవ్వక చుక్కలు కనిపించే పరిస్థితి వచ్చింది…మరి దీనిపై హీరోలు నిర్మాతలు సరైన స్టెప్స్ తీసుకుని ఫ్యూచర్ లో పరిస్థితులను ఎలా చక్కదిద్దుతారు అనేది ఆసక్తిగా మారింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here