Home Uncategorized దుమ్ము లేపుతున్న టిల్లు స్క్వేర్….ఆల్ రెడీ అక్కడ 85L ఔట్!

దుమ్ము లేపుతున్న టిల్లు స్క్వేర్….ఆల్ రెడీ అక్కడ 85L ఔట్!

0

సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతున్న సినిమాల్లో యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న సినిమా టిల్లు స్క్వేర్(Tillu Square Movie)…. మొదటి పార్ట్ భారీ విజయం హెల్ప్ అలాగే రెండో పార్ట్ టీసర్ ట్రైలర్ లు ఆకట్టుకోవడంతో పార్ట్ 2 పై మంచి బజ్ అండ్ అంచనాలు ఏర్పడ్డాయి…. 

ఇక సమ్మర్ లో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ బిగ్ రిలీజ్ కూడా ఈ సినిమానే అవ్వడంతో బిజినెస్ పరంగా కూడా మంచి జోరుని చూపించిన ఈ సినిమా ఆల్ రెడీ ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్స్ ను కూడా ఓపెన్ చేశారు…. అక్కడ సినిమా కి మంచి డిమాండ్ ఏర్పడింది ఇప్పుడు… అడ్వాన్స్ బుకింగ్స్ యమ జోరుగా కొనసాగుతూ ఉండగా…

బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది సేపటికే సినిమా కి 100K డాలర్స్ మార్క్ ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకుని దూసుకు పోతూ ఉండగా ఇండియన్ కరెన్సీలో ఆల్ రెడీ 85 లక్షల గ్రాస్ బుకింగ్స్ ను సినిమా సొంతం చేసుకుంది. అన్ని చోట్లా మంచి జోరు ని చూపించబోతున్న ఈ సినిమా….

తెలుగు రాష్ట్రాల్లో కూడా సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది, ఇక టాక్ కనుక పాజిటివ్ గా వస్తే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ లాభాలను కూడా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సమ్మర్ రేసులో టిల్లు స్క్వేర్ మూవీ ఏ రేంజ్ లో రచ్చ లేపుతుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here