Home న్యూస్ జరగండి(గేమ్ చేంజర్) సాంగ్ రివ్యూ….శంకర్ మార్క్ విజువల్ వండర్!

జరగండి(గేమ్ చేంజర్) సాంగ్ రివ్యూ….శంకర్ మార్క్ విజువల్ వండర్!

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల క్రేజీ కాంబోలో రూపొందుతున్న సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie) సినిమా నుండి ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన జరగండి జరగండి(Jaragandi Song) ముందే లీక్ అవ్వడంతో మేకర్స్ సాంగ్ రిలీజ్ ను ఆపేయగా…ఇప్పుడు 

రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా సినిమా ఫస్ట్ సాంగ్ అయిన జరగండిని రిలీజ్ చేశారు…. శంకర్ డైరెక్షన్ లో వచ్చే సినిమాల్లో సాంగ్స్ అన్నీ కూడా విజువల్ వండర్ లా అనిపిస్తాయి…అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా జరగండి సాంగ్ లో చూపించిన కొన్ని విజువల్స్ అలానే ఉండటం విశేషం…

ఇక సాంగ్ ఆల్ రెడీ లీక్ అయినప్పుడే చాలా మంది వినేయగా ఫస్ట్ లో కొంచం ట్రోల్ అయినా కూడా తర్వాత సాంగ్ ఈజీగా ఎక్కేసింది అని చెప్పొచ్చు. ఇప్పుడు అఫీషియల్ మంచి సౌండ్ క్లారిటీ తో వచ్చిన సాంగ్ ఫస్ట్ టైం విన్నప్పుడే మంచి కిక్ ఇచ్చేలా ఉందని చెప్పొచ్చు… 

థియేటర్స్ లో చూసే టైంలో విజువల్స్ పరంగా కూడా అబ్బుర పరిచే అవకాశం ఎంతైనా ఉండటంతో విజువల్ పరంగా ఇంకా బాగా మెప్పించే అవకాశం ఎంతైనా ఉంది, సాంగ్ లో రామ్ చరణ్ కియరా అద్వాని ల పెయిర్ చాలా బాగా సెట్ అయ్యింది అని చెప్పాలి. తమన్ సంగీతం కూడా ఆకట్టుకోగా…

లీక్ అయినప్పుడు ట్రోల్ అయినా కూడా ఇప్పుడు మాత్రం వినగానే సాంగ్ క్యాచీగా మెప్పించింది అని చెప్పొచ్చు… ఇక సాంగ్ కి 24 గంటల్లో యూట్యూబ్ లో ఇప్పుడు ఎన్ని మిలియన్స్ వ్యూస్ అండ్ లైక్స్ సొంతం అవుతాయి అన్నది ఆసక్తిగా మారిందని చెప్పాలి. ఇక ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న రామ్ చరణ్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here