Home న్యూస్ ఇప్పటికీ పూర్తి అవ్వని టిల్లు2….ఇలా అయితే ఎలా సామి!!

ఇప్పటికీ పూర్తి అవ్వని టిల్లు2….ఇలా అయితే ఎలా సామి!!

0

రెండేళ్ళ క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ హిట్ గా నిలిచిన డిజే టిల్లు(DJ Tillu Movie) యూత్ ని బాగా అట్రాక్ట్ చేసింది….చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ విజయాన్ని క్యాష్ చేసుకోవడానికి వెంటనే ఆ సినిమా సీక్వెల్ ను టీం అనౌన్స్ చేశారు… టిల్లు స్క్వేర్(Tillu Suare Movie) అని టైటిల్ పెట్టారు…

అప్పటి నుండి షూటింగ్ జరుగుతూనే ఉన్న ఈ క్రేజీ సీక్వెల్ టీం లో కొన్ని మార్పులు జరిగాయి, కానీ ఎప్పటికప్పుడు షూటింగ్ లో డిలేలు అవుతూ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతూ ఉన్నా కూడా సినిమా మీద క్రేజ్ అయితే ఏమి తగ్గలేదు, ఎట్టకేలకు సినిమా మార్చ్ నెల ఎండ్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా….

ఇప్పటి వరకు కూడా సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ ఇంకా కొట్టలేదని సమాచారం… ఇంకా వారం రోజుల రేంజ్ లో షూటింగ్ బాలెన్స్ ఉంది అన్నది స్ట్రాంగ్ గా వినిపిస్తున్న వార్తా…అంటే రిలీజ్ కి వారం 10 రోజుల ముందు దాకా షూటింగ్ జరగబోతుందని చెప్పొచ్చు, తర్వాత ప్రమోషన్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అన్నీ జరగాల్సి ఉంటుంది….

టైం తక్కువగానే ఉండటంతో ఇవన్నీ ఎలా మ్యానేజ్ చేస్తారు అన్నది ఆసక్తిగా మారగా రీసెంట్ టైంలో చాలా టైం షూటింగ్ జరుపుకున్న మూవీస్ లో టిల్లు స్క్వేర్ మూవీ కూడా ఒకటిగా నిలుస్తుంది అంటున్నారు… అయినా కానీ యూత్ లో సినిమా మీద మంచి క్రేజ్ ఉండటం, సినిమా ట్రైలర్ కి కూడా….

ఆడియన్స్ నుండి మంచి బజ్ ఏర్పడటంతో టీం రిలీజ్ ముందు వరకు ఎంత డిలే చేసినా డీసెంట్ ఔట్ పుట్ ఇస్తే చాలు సమ్మర్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఈ సీక్వెల్ మూవీ దుమ్ము దుమారం లేపే అవకాశం అయితే ఎంతైనా ఉంటుందని చెప్పొచ్చు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here