Home న్యూస్ డిజే టిల్లు2 ని భయపెడుతున్న గాడ్జిల్లా-కాంగ్…ఏమవుతుందో ఇక!!

డిజే టిల్లు2 ని భయపెడుతున్న గాడ్జిల్లా-కాంగ్…ఏమవుతుందో ఇక!!

0

సమ్మర్ మొదలు అవ్వగా ఈ మంత్ ఎండ్ నుండి ఇక అన్ని ఇండస్ట్రీలలో మంచి సినిమాలు కొన్ని రిలీజ్ కాబోతూ ఉండగా టాలీవుడ్ లో పెద్ద సినిమాలు ఎలక్షన్స్ వలన కొంచం పోస్ట్ పోన్ అవ్వగా సమ్మర్ రేసులో నిలిచిన సినిమాల్లో మీడియం రేంజ్ మూవీస్ లో మంచి బజ్ ను సొంతం చేసుకుని ఇప్పుడు…

ఆడియన్స్ ముందుకు రాబోతున్న మూవీస్ లో సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన బ్లాక్ బస్టర్ డిజే టిల్లు(Dj Tillu Movie) కి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్(Tillu Square Movie) తో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతూ ఉండగా గ్రాండ్ గా సినిమా 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుండగా….

ఈ సినిమాకి మంచి బజ్ ఉన్నా కూడా పోటిలో ఓ హాలీవుడ్ బిగ్గీ ఉండటంతో పోటి తీవ్రంగా ఉండబోతుంది అని చెప్పాలి ఇప్పుడు….హాలీవుడ్ బిగ్గీ గాడ్జిల్లా-కాంగ్2(Godzilla x Kong: The New Empire) మూవీ భారీ అంచనాల నడుమ వరల్డ్ వైడ్ గా ఇండియా లో రిలీజ్ కాబోతుంది…

మొదటి పార్ట్ కోవిడ్ టైంలో డిజిటల్ లో అండ్ థియేటర్స్ లో లిమిటెడ్ గా రిలీజ్ అయింది, కానీ పార్ట్ 2 పై మంచి అంచనాలు ఉండగా తెలుగు లో కూడా ఈ ఫ్రాంచేజ్ మీద అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా 29నే రిలీజ్ కానుండటంతో టిల్లు స్క్వేర్ సినిమా పై ఈ సినిమా ఇంపాక్ట్ ఎంతైనా ఉంటుందని చెప్పాలి…

ముఖ్యంగా మల్టిప్లెక్స్ లలో షోల విషయంలో మాస్ సెంటర్స్ లో మంచి ఆక్యుపెన్సీని ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. మరి రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటిలో టిల్లు2 ఎంత లీడ్ ని చూపించగలుగుతుంది ఎలాంటి కలెక్షన్స్ ని దక్కించుకుంటుందో అన్నది ఆసక్తిగా మారింది. మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here