Home న్యూస్ 50 కోట్ల యాత్ర2…..OTT రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసా!!

50 కోట్ల యాత్ర2…..OTT రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా పొలిటికల్ నేపధ్యంలో వరుస పెట్టి సినిమాలు వచ్చాయి, వచ్చిన సినిమాలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా యాత్ర2(Yatra2 OTT Review)….ఫిబ్రవరి లో రిలీజ్ అవ్వగా సినిమా కి మంచి రివ్యూలు సొంతం అయ్యాయి. కానీ కలెక్షన్స్ పరంగా మొదటి పార్ట్ కలెక్షన్స్ ఓపెనింగ్స్ ను కానీ…

లాంగ్ రన్ ను కానీ ఏమాత్రం టచ్ చేయలేక పోయింది. దాంతో బడ్జెట్ పరంగా 50 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన యాత్ర2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాఫ్ గా నిలిచింది ఈ సినిమా…ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ ను చాలా త్వరగానే పూర్తి చేసుకున్న సినిమా డిజిటల్ రిలీజ్ అవ్వడానికి కొంచం టైం పట్టింది….

రీసెంట్ గా సినిమా అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఇక్క OTT లో రిలీజ్ అయిన తర్వాత సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది ఆసక్తిగా మారగా, YSR అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి సినిమాలో కొన్ని మూమెంట్స్ బాగానే ఇంప్రెస్ చేయగా YS జగన్ ఇష్టం ఉన్న ఆడియన్స్ కి కూడా పర్వాలేదు అనిపించేలా అనిపించింది సినిమా…

కానీ చాలా వరకు న్యూట్రల్ ఆడియన్స్ విషయానికి వస్తే మాత్రం ఓవర్ ది టాప్ అనిపించేలా సీన్స్ ఉన్నాయని, స్టార్టింగ్ బాగున్నా కూడా తర్వాత కంప్లీట్ డ్రాగ్ అయిందని అంటున్నారు…ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నా కూడా ఓవరాల్ గా మూవీ మొదటి పార్ట్ రేంజ్ తో పోల్చితే మాత్రం పెద్దగా అంచనాలను అందుకోలేదని అంటున్నారు…

కానీ రీసెంట్ టైంలో వచ్చిన ఇతర పొలిటికల్ మూవీస్ తో పోల్చితే యాత్ర2 మాత్రం కొంచం పర్వాలేదు అనిపించేలా ఉంటుంది అంటున్నారు…డిజిటల్ రిలీజ్ లో సినిమాకి మొత్తం మీద యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ సొంతం అవుతుంది అని చెప్పాలి. ఇక డిజిటల్ లో సినిమాకి ఎలాంటి వ్యూవర్ షిప్ సొంతం అవుతుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here