Home న్యూస్ టిల్లు స్క్వేర్ రివ్యూ……హిట్టు బొమ్మ బాస్!!

టిల్లు స్క్వేర్ రివ్యూ……హిట్టు బొమ్మ బాస్!!

0

రెండేళ్ళ క్రితం డిజే టిల్లు(Dj Tillu Movie) తో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సిద్హూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) ఆ సినిమా కి సీక్వెల్ గా చేసిన టిల్లు స్క్వేర్(Tillu Square Movie REVIEW) తో ఆల్ రెడీ మంచి హైప్ ను సొంతం చేసుకున్నాడు. మరి ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో వచ్చిన ఈ సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే….మొదటి సినిమాలో రాధిక వల్ల అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన డిజే టిల్లు ఈ పార్ట్ లో లిల్లీ లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేశాడు…చివరికి ఎలా బయట పడ్డాడు అన్నది ఓవరాల్ గా సినిమా స్టోరీ పాయింట్…. కథ పాయింట్ పెద్దగా ఏమి లేక పోయినా కానీ…

జస్ట్ హీరో క్యారెక్టర్ మీదే నడిచిన పార్ట్ 1 కి ఏమాత్రం తీసి పోని విధంగా టిల్లు స్క్వేర్ కూడా కంప్లీట్ గా సిద్హూ జొన్నలగడ్డ స్క్రీన్ ప్రజెన్స్ అండ్ క్యారెక్టర్ మీదే నడుస్తుంది… హీరో సింగిల్ లైన్ పంచుల వర్షం కురిపించగా అవన్నీ కూడా హిలేరియస్ గా వర్కౌట్ అయ్యాయి. కొన్ని చోట్ల ఇక చాలు అనుకున్నా కూడా హీరో సింగిల్ లైన్ పంచుల వర్షం ఆగదు…

అనుపమ రోల్ గ్లామరస్ గా ఉండగా ఉన్నంతలో బాగా నటించింది అనుపమ…. కానీ పార్ట్ 1 రేంజ్ లో హీరో హీరోయిన్స్ ల కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు ఏమో అనిపించింది, కానీ పర్వాలేదు… మిగిలిన యాక్టర్స్ అందరూ బాగానే నటించగా, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే క్రిస్ప్ రన్ టైం తో ఆకట్టుకోగా కొన్ని చోట్ల సీన్స్ రిపీటివ్ గా అనిపించడం ఒక్కటి కొంచం డ్రా బ్యాక్….

సంగీతం సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా సీన్స్ ని ఎలివేట్ చేసింది..డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా హీరో సింగిల్ లైన్ పంచులు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్… ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్ లెంట్ గా ఉండగా డైరెక్టర్ ఆల్ రెడీ ఫేమస్ అయిన డిజే టిల్లు రోల్ ని…

ఏమాత్రం చెడగొట్టకుండా ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు సినిమాలో పెట్టాడు.. స్టార్టింగ్ లో గ్లామర్ డోస్ కొంచం ఎక్కువ అవ్వడంతో కొంచం ట్రాక్ తప్పుతున్నట్లు అనిపించినా తిరిగి కథని జెట్ స్పీడ్ తో నడపడం మొదలు పెట్టి పర్వాలేదు అనిపించేలా ఇంటర్వెల్ ఎపిసోడ్ పెట్టి సెకెండ్ ఆఫ్ లో స్పై ఎలిమెంట్స్ తో కథని నడిపాడు…

క్లైమాక్స్ ఎపిసోడ్ మళ్ళీ ఆకట్టుకునేలా తీసి ఓవరాల్ గా మొదటి పార్ట్ కి ఏమాత్రం తీసిపోని సినిమాను అందించాడు అని చెప్పొచ్చు. మీకు మొదటి పార్ట్ నచ్చిందా…సెకెండ్ ఆఫ్ ఈజీగా నచ్చేస్తుంది…. కొంచం అక్కడక్కడా రిపీటివ్ గా సీన్స్ వచ్చినా కూడా ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైం కి ఓ మంచి ఎంటర్ టైనర్ చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ బయటికి రావడం ఖాయం… మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 3 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here