Home న్యూస్ మాస్ రచ్చ ఇది…ఇక్కడ షో పడకుండానే అక్కడ 4CR ఔట్…అరాచకం!

మాస్ రచ్చ ఇది…ఇక్కడ షో పడకుండానే అక్కడ 4CR ఔట్…అరాచకం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి లాస్ట్ 2 నెలల్లో అంచనాలను అందుకున్న సినిమాలు చాలా తక్కువే వచ్చాయి… ఇలాంటి టైంలో సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు భారీ గా రిలీజ్ కి సిద్ధం అయిన సిద్హూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) నటించిన….

బ్లాక్ బస్టర్ డిజే టిల్లు(Dj Tillu Movie) కి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్(Tillu Square Movie)….ఎక్స్ లెంట్ గా జోరు చూపించడానికి సిద్ధం అవ్వగా సినిమా ప్రీమియర్ షోలకు సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా రెగ్యులర్ షోలు పడక ముందే…

ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న టిల్లు స్క్వేర్ మూవీ ఆల్ రెడీ ట్రాక్ చేసిన సెంటర్స్ $450K డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి హాల్ఫ్ మిలియన్ మార్క్ వైపు దూసుకు పోతుంది… ఓ మీడియం రేంజ్ మూవీ కి ఈ రేంజ్ ఓపెనింగ్స్ అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి…

ఇండియన్ కరెన్సీలో ఆల్ మోస్ట్ 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ఆల్ రెడీ సినిమాకు కన్ఫాం అయ్యాయి అని చెప్పొచ్చు….తెలుగు రాష్ట్రాల్లో షోలు పడక ముందే ప్రీమియర్స్ తో ఈ రేంజ్ లో రచ్చ చేయడం ఊచకోత అనే చెప్పాలి. ప్రీమియర్ షోల నుండి సినిమాకి మంచి రెస్పాన్స్ వినిపిస్తూ ఉండటంతో…

రెగ్యులర్ షోలకు తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దంచి కొట్టే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. సమ్మర్ రేసులో టిల్లు స్క్వేర్ హవా పాజిటివ్ టాక్ తో కచ్చితంగా సాలిడ్ గా సాగే ఛాన్స్ ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు… ఇక డే 1 కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here