Home న్యూస్ టిల్లు స్క్వేర్ నైజాం బిజినెస్ ఆఫర్….ఇదేం మాస్ రచ్చ సామి!!

టిల్లు స్క్వేర్ నైజాం బిజినెస్ ఆఫర్….ఇదేం మాస్ రచ్చ సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం సెన్సేషనల్ హిట్ గా నిలిచిన డిజే టిల్లు(DJ Tillu) మూవీ కి సీక్వెల్ గా వస్తున్న కొత్త సినిమా టిల్లు స్క్వేర్(Tillu Square Movie) ఆడియన్స్ ముందుకు ఈ సమ్మర్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సిద్ధూ జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ఈ గ్యాప్ లో మరే సినిమా చేయకుండా…

ఈ సినిమా మీదే ఫుల్ ఫోకస్ పెట్టగా సినిమా ట్రైలర్ రీసెంట్ రిలీజ్ అవ్వగా టార్గెట్ యూత్ ఆడియన్స్ ని బాగానే అట్రాక్ట్ చేయగా సినిమా మీద ట్రేడ్ లో మంచి బజ్ ఏర్పడింది. దాంతో బిజినెస్ పరంగా కూడా టిల్లు స్క్వేర్ సినిమాకి సాలిడ్ ఆఫర్స్ అన్ని ఏరియాల నుండి వస్తూ ఉండగా…

నైజాం ఏరియాలో సినిమా బిజినెస్ ఆఫర్స్ రేంజ్ కూడా సాలిడ్ గా పెరిగి పోయింది అని చెప్పొచ్చు… ముందు సమ్మర్ లో భారీ పోటి ఉండటంతో ఈ సినిమా కి బిజినెస్ ఆఫర్స్ 6-7 కోట్ల దాకా రాగా ఇప్పుడు సమ్మర్ లో పోటి తగ్గగా ఈ సినిమా ఫస్ట్ బిగ్ సమ్మర్ మూవీగా రిలీజ్ కానుండటంతో సినిమా బిజినెస్ రేంజ్ పెరిగి…

ఇప్పుడు ఏకంగా 9-10 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఆఫర్స్ వస్తూ ఉన్నాయట. మేకర్స్ 10 కోట్ల రేంజ్ బిజినెస్ ఎక్స్ పెర్ట్ చేస్తూ ఉండగా ఆ రేటు కన్ఫాం అయితే బిజినెస్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు, అప్పట్లో డిజే టిల్లు సినిమా నైజాంలో 2.8 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుని…

టోటల్ రన్ లో ఏకంగా 7.19 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఆల్ మోస్ట్ 9-10 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను దక్కించుకుని సమ్మర్ కానుకగా భారీ అంచనాల నడుమ రిలీజ్ కానున్న టిల్లు స్క్వేర్ ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here