Home న్యూస్ తిప్పరా మీసం రివ్యూ….పారిపోండిరోయ్!!!

తిప్పరా మీసం రివ్యూ….పారిపోండిరోయ్!!!

0

     రీసెంట్ టైం లో టాలీవుడ్ యంగ్ హీరోల్లో డిఫెరెంట్ స్టొరీలను ఎంచుకుంటూ ఒక్కో అడుగు ముందుకేస్తూ దూసుకుపోతున్న హీరో శ్రీ విష్ణు. మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ, బ్రోచేవారెవరురా లాంటి డిఫెరెంట్ మూవీస్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ తిప్పరా మీసం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, బ్రోచేవారెవరురా తో సూపర్ హిట్ కొట్టిన విష్ణు ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకున్నాడో చూద్దాం పదండీ..

కథ పాయింట్… చిన్నప్పుడే డ్రగ్స్ కి అలవాటు పడ్డ హీరో ని రిహాబిలేషన్ సెంటర్లో చేర్చగా అప్పటి నుండి తన తల్లి ని విలన్ లా చూసే హీరో పెద్దయ్యాకా పబ్ లో జాకీ గా పనిచేస్తూ క్రికెట్ బెట్టింగ్స్ కి అలవాటు పడతారు, తర్వాత ఒక వ్యక్తీకి 30 లక్షల అప్పు తో జైలు వెళతాడు, అసలు రీజన్ ఏంటి, ఎందుకు జైలుకు వెళ్ళాడు,

తిరిగి తన తల్లితో కలిశాడా లేదా అన్నది ఓవరాల్ గా సినిమా కథ… కథ పాయింట్ కొంచం కొత్తగా ఉన్నా లెంత్ మరీ ఎక్కువ అవ్వడం సినిమా కి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్, అలాగే చాలా స్లో నరేషన్ తో కూడుకున్న కథ ఎప్పుడు అయిపోతుందా అని చూస్తున్న ఆడియన్స్ ఎదురు చూసేలా చేస్తుంది.

ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ అలాగే సెకెండ్ ఆఫ్ లో కొన్ని సీన్స్ మెప్పించాగా, తల్లి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు కొన్ని ఆకట్టుకుంటాయి. హీరో గా శ్రీవిష్ణు, తల్లిగా రోహిణి ఆకట్టుకోగా మిగిలిన వాళ్ళు ఓకే అనిపిస్తారు, సంగీతం యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. ఎడిటింగ్ చాలా చేయాల్సిన అవసరం ఉండగా స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉంటుంది.

డైరెక్షన్ చాలా వీక్ గా ఉండగా ఓవరాల్ గా సినిమా అటు రెగ్యులర్ ఆడియన్స్ ని ఇటు కొత్త కథలు కోరుకునే ఆడియన్స్ ని కూడా పెద్దగా మెప్పించలేదు. ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2 స్టార్స్… శ్రీ విష్ణు అండ్ రోహిణి పెర్ఫార్మెన్స్ కోసం అలాగే కొన్ని మంచి సీన్స్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కోసం ఒకసారి కష్టపడుతూ చూడొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here