Home న్యూస్ 1 కాదు 2 కాదు…ఏకంగా 7 రీమేక్ లు అంటున్న మంచు విష్ణు!!

1 కాదు 2 కాదు…ఏకంగా 7 రీమేక్ లు అంటున్న మంచు విష్ణు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ ని అందుకుని ఏళ్ళు అవుతున్న మంచు విష్ణు ఇప్పుడు కొత్తగా జిన్నా సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా తో కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకుంటానని ధీమాగా ఉండగా సినిమా భారీ పోటి లోనే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగడానికి సిద్ధం అవుతున్న సినిమా అని చెప్పాలి.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటున్న మంచు విష్ణు ఈ సినిమా తర్వాత ప్రాజెక్ట్స్ పై కూడా మాట్లాడగా డిసెంబర్ నుండి తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అయిన ఢీ సినిమా సీక్వెల్ ని శ్రీనువైట్ల డైరెక్షన్ లో మొదలు పెట్టబోతున్నామని వెల్లడించగా…

ఆ సినిమా తో పాటు టోటల్ గా 7 క్రేజీ సినిమాల రీమేక్ రైట్స్ ను నేను సొంతం చేసుకుని ఉంచానని, అందులో ఒకటి ‘ఆండ్రాయిడ్ కట్టప్ప’ అని వెల్లడించాడు. ఈ సినిమాను మోహన్ బాబు తో రీమేక్ చేయబోతున్నట్లు కన్ఫాం చేయగా… మిగిలిన 6 సినిమాలకు…

తగ్గ దర్శకులు దొరికిన తర్వాత ఆ ప్రాజెక్ట్ లను కూడా తెలియజేస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రీమేక్ సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తుందో అందరికీ తెలిసిందే. ఇలాంటి టైం లో ఏకంగా 7 రీమేక్ లను కొన్న మంచు విష్ణుకు ఇది ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here