బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా కాలంగా హిట్ కి దూరం అయిన శర్వానంద్ నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా ఏమంత ఆకట్టుకునేలా లేక పోవడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్ర నిరాశ పరిచాయి. ఇలాంటి టైం లో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ శ్రీకారం మంచి అంచనాలనే సినిమా పై వచ్చేలా చేసింది, దాంతో సినిమా కచ్చితంగా శర్వానంద్ కి కంబ్యాక్ మూవీ గా నిలుస్తుంది అని అంతా అనుకున్నారు.
సినిమా రిలీజ్ అవ్వడం మంచి పాజిటివ్ టాక్ తోనే రిలీజ్ అయింది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు తప్పితే తర్వాత నుండి అసలు జనాలను థియేటర్స్ కి రప్పించడంలో విఫలం అయ్యింది ఈ సినిమా. దానికి తోడూ టికెట్ హైక్స్ భారీగా పెట్టడం కూడా ఇంపాక్ట్ చూపి…
మొత్తం మీద సినిమా కలెక్షన్స్ ఏమంత ఆశాజనకంగా రాలేదు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి భారీ నష్టాలను ఇప్పుడు సొంతం చేసుకుని శర్వానంద్ కెరీర్ లో బాక్ టు బాక్ నాలుగో డిసాస్టర్ మూవీ నిలిచేలా చేసింది అని చెప్పొచ్చు.
మొత్తం మీద రన్ కంప్లీట్ అయ్యే టైం కి సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే
👉Nizam: 2.86Cr
👉Ceeded: 1.66Cr
👉UA: 1.21Cr
👉East: 74L
👉West: 50L
👉Guntur: 99L
👉Krishna: 53L
👉Nellore: 32L
AP-TG Total:- 8.82CR (14.83Cr Gross~)
Ka+ROI – 28L( updated )
OS – 54L
Total World Wide: 9.64CR( 16.40CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్…
సినిమాను టోటల్ గా 17.౧ కోట్లకు అమ్మగా సినిమా 17.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి టోటల్ రన్ కంప్లీట్ అయ్యాక మొత్తం మీద బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 7.88 కోట్ల నష్టాన్ని సొంతం చేసుకుని డిసాస్టర్ గా మిగిలింది, పాజిటివ్ టాక్ వచ్చినా ఈ రేంజ్ డిసాస్టర్ అవ్వడం విచారకరం.. ఇక శర్వానంద్ తన అప్ కమింగ్ మూవీ తో అయినా కంబ్యాక్ ఇస్తాడని ఆశిద్దాం.