Home న్యూస్ ట్రూ లవర్ మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

ట్రూ లవర్ మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో తమిళ్ నుండి తెలుగులోకి డబ్ అయిన ట్రూ లవర్(True Lover Telugu Review) మూవీ ఒకటి….ట్రైలర్ యూత్ కి నచ్చే విధంగా ఉండటంతో మినిమమ్ బజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…

స్టొరీ పాయింట్ విషయానికి వస్తే….తన పేరెంట్స్ మధ్య జరుగుతున్న గొడవల వలన లైఫ్ లో ప్రతీ చిన్న దానికి చిరాకు పడుతూ ఉంటాడు హీరో…అలాంటిది తను ప్రేమించిన అమ్మాయి ఇతర వ్యక్తులతో కలిసి మాట్లాడినా తనకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళినా గొడవ పడుతూ ఉంటాడు. అలాంటి వీళ్ళ లైఫ్ ఎలా టర్న్ తీసుకుని ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

చాలా తిన్ స్టొరీ లైన్ లో వచ్చిన ఈ సినిమా మొదట్లో బాగానే ఆకట్టుకుంటుంది, కానీ పదే పదే హీరో హీరోయిన్స్ గొడవ పడటం, హీరో అనుమాన పడటం లాంటివి రిపీట్ అవుతూనే ఉండటంతో ఒక స్టేజ్ దాటాకా కొంచం బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది కానీ సినిమాలో ఎమోషన్స్ కానీ, కొన్ని చోట్ల కామెడీ సీన్స్ కానీ హీరో హీరోయిన్స్ ల కాంబో సీన్స్ కానీ ఆడియన్స్ ను చాలా వరకు ఆకట్టుకుంటాయి.

స్టార్ కాస్ట్ పెద్దగా నోటబుల్ కాకపోయినా కానీ చాలా వరకు సినిమా బోర్ ఫీల్ అవ్వకుండా ఒక టెంపోలో సాగుతుంది, కొన్ని చోట్ల సీన్స్ రిపీటివ్ గా అనిపించడం డ్రా బ్యాక్ అయినా కూడా ఓవరాల్ గా చూసుకుంటే ప్రజెంట్ జనరేషన్ ఆడియన్స్ కి చాలా వరకు కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పొచ్చు ఈ సినిమా….

లీడ్ యాక్టర్స్ అందరూ బాగా పెర్ఫార్మ్ చేయగా ఫ్యామిలీ ఎమోషన్స్, క్లైమాక్స్ పోర్షన్ బాగానే వర్కౌట్ అయ్యాయి. సంగీతం సినిమా ఫీల్ కి తగ్గట్లు మెప్పించాగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, తెలుగు డబ్బింగ్ బాగుండగా…యూత్ కి నచ్చే ఎలిమెంట్స్ సినిమాలో ఉండటం, కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అవ్వడం, 

ఎమోషన్స్ కనెక్ట్ అయ్యేలా ఉండటం మేజర్ ప్లస్ పాయింట్స్ అయితే  కొన్ని చోట్ల సీన్స్ రిపీటివ్ గా, కొన్ని చోట్ల కొంచం డ్రాగ్ అయినట్లు అనిపించడం కొన్ని డ్రా బ్యాక్స్…. సినిమా ఎండ్ అయ్యే టైంకి ఓ డీసెంట్ యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ చూసిన ఫీలింగ్ ఆడియన్స్ కి కలగడం ఖాయం. మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here