Home న్యూస్ ఉస్తాద్ భగత్ సింగ్ న్యూ గ్లిమ్స్ రివ్యూ…..మాస్ ఊచకోత ఇది!

ఉస్తాద్ భగత్ సింగ్ న్యూ గ్లిమ్స్ రివ్యూ…..మాస్ ఊచకోత ఇది!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హరీష్ శంకర్(Harish Shankar) ల కాంబోలో గబ్బర్ సింగ్(Gabbar Singh) లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత చాలా టైం కి సెట్ అయిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh Movie)…పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్ లో మంచి బజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…

నుండి కొత్త గ్లిమ్స్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు…..భగత్’స్ బ్లేజ్ అంటూ టైటిల్ తో వచ్చిన ఈ టీసర్ సినిమా మీద అంచనాలను సాలిడ్ గా పెంచేసింది అనే చెప్పాలి. అదే టైంలో కంప్లీట్ గా పొలిటికల్ టచ్ ఉన్న డైలాగ్స్ ఫ్యాన్స్ కి బాగానే కిక్ ఇచ్చాయి అని చెప్పాలి…. ఇక దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా కుమ్మేసింది…

ఈ టీసర్ లో గాజు పగిలే కొద్దీ పదును ఎక్కువ గుర్తు పెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం… కనిపించని సైన్యం లాంటి డైలాగ్స్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చాయి… ఓవరాల్ గా సడెన్ సర్ప్రైజ్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ టీసర్ సినిమా మీద మరింత బజ్ పెరిగేలా చేసింది…

ఎప్పుడు ఆడియన్స్ ముందుకు సినిమా వస్తుంది అన్నది పెద్దగా క్లారిటీ ఇంకా లేకున్నా కూడా ఓవరాల్ గా ఎప్పుడు వచ్చినా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ మ్యాజిక్ ను మళ్ళీ రీ క్రియేట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి… ఇక ఈ గ్లిమ్స్ మొత్తం మీద 24 గంటలలో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here