Home న్యూస్ అదరగొట్టిన అల్లరోడు….ఉగ్రం నాన్ థియేట్రికల్ రైట్స్ కి సాలిడ్ రేటు!!

అదరగొట్టిన అల్లరోడు….ఉగ్రం నాన్ థియేట్రికల్ రైట్స్ కి సాలిడ్ రేటు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ ఉగ్రం సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకున్నా కానీ ఎందుకనో జనాలు అల్లరోడి నుండి ఇలాంటి సీరియస్ మూవీని చూడటానికి అనుకున్న రేంజ్ లో ఆదరించడం లేదు… బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఉండగా సినిమా తో మేకర్స్ కి మాత్రం సాలిడ్ రేటునే వెనక్కి తెప్పించాడు అల్లరోడు…

సినిమా బాక్స్ ఆఫీస్ బిజినెస్ వాల్యూ 5.80 కోట్ల రేంజ్ రేటుని సొంతం చేసుకోగా ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ రేటు మాత్రం ఆల్ మోస్ట్ థియేట్రికల్ బిజినెస్ కన్నా డబుల్ రేటుని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…

టోటల్ గా డిజిటల్, శాటిలైట్ మరియు డబ్బింగ్ రైట్స్ తో కలిపి సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ రేటు ఏకంగా 10.50 కోట్ల రేంజ్ రేటుని సొంతం చేసుకుందని సమాచారం. దాంతో థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ రెండూ కలిపి ఏకంగా 16.30 కోట్ల దాకా బిజినెస్ ను సొంతం చేసుకుందని సమాచారం.

కెరీర్ లో కొంచం లో ఫేస్ లో ఉన్నప్పటికీ కూడా హిట్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ అవ్వడంతో ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎక్స్ లెంట్ రేటుని సొంతం చేసుకోవడంతో మేకర్స్ కి సినిమా మంచి రికవరీని ఇప్పించగా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సినిమా ఇంకా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here