నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ బింబిసార ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది. మొదటి వీకెండ్ లో సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా వర్కింగ్ డేస్ లో కూడా అద్బుతమైన హోల్డ్ ని చూపిస్తూ ఉండగా రీసెంట్ గా సినిమా సక్సెస్ మీట్ లో సినిమా డిజిటల్ రిలీజ్ పై కొన్ని ఆసక్తి కరమైన కామెంట్స్ చేశారు…
సోషల్ మీడియా లో సినిమా 5 వారాలకే డిజిటల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందీ అంటూ వార్తలు వస్తున్న నేపధ్యంలో సినిమా టీం ఇవన్నీ ఉట్టి మాటలే నని తేల్చేశారు…. దాంతో పాటు సినిమా ను డిజిటల్ రిలీజ్ అవ్వాలి అంటే మినిమమ్….
50 రోజుల దాకా ఆగాల్సిందే నంటూ గట్టిగానే కామెంట్స్ చేశారు. దాంతో సినిమా నెల లోపే డిజిటల్ లో వస్తుంది అన్న వార్తలకు చెక్ పడినట్లు అయింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 రోజులను పూర్తీ చేసుకున్న తరువాతే డిజిటల్ రిలీజ్ కానుంది.
సినిమా డిజిటల్ రైట్స్ ను జీ నెట్ వర్క్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. వాళ్ళు 50 డేస్ తర్వాత సినిమాను డిజిటల్ లో రిలీజ్ చేస్తారని సమాచారం. దాంతో సినిమాకి లాంగ్ రన్ కచ్చితంగా ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర…