మంచి మాస్ కంటెంట్ ఉన్న సినిమా కి అడ్వాన్స్ బుకింగ్స్ యావరేజ్ గా ఉన్నా టాక్ పాజిటివ్ గా వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ జోరు పెరుగుతూనే ఉంటుంది, వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వాల్మీకి (గద్దల కొండ గణేష్) బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ముందు యావరేజ్ గా ఉన్నా టాక్ బాగుండటం తో ఓపెనింగ్స్ జోరు అందుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఓపెనింగ్స్ జోరు అందుకోవడం తో తొలి రెండు షోలకు మొత్తం మీద ఆక్యుపెన్సీ సుమారు 40% వరకు ఉందని సమాచారం, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల గ్రోత్ అండ్ టికెట్ సేల్స్ జోరు అందుకోవడం తో సినిమా తొలిరోజు మంచి వసూళ్లు సాధించే దిశగా అడుగులు వేస్తుంది.
ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ ని బట్టి 3.5 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవడం ఏమాత్రం కష్టం కాదని చెప్పొచ్చు, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో గ్రోత్ మరింత పెరిగి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా అనుకున్న రేంజ్ ని అందుకుంటే ఈ లెక్క అవలీలగా 3.8 కోట్ల నుండి 4 కోట్లకు…
వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉంది, బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా తొలి రోజు మంచి వసూళ్ళ ని అందుకునే దిశగా దూసుకు పోతుంది, క్లాస్ సెంటర్స్ లోనే బుకింగ్స్ బాగున్నాయి అనుకుంటే మాస్ సెంటర్స్ లో కూడా ఈక్వల్ గా సినిమా టికెట్ సేల్స్…
జోరుగా సాగుతుండటం తో కచ్చితంగా సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి ఎలాంటి గ్రోత్ ని సాధించి మొత్తం మీద ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకోగలుగుతుందో చూడాలి.