కెరీర్ మొదలు పెట్టడం స్లో గా మొదలు పెట్టినా కంచే తో గాడిలో పది ఫిదా తో తొలి బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తర్వాత వెను తిరిగి చూసుకోకుండా దూసుకు పోతున్నాడు, లాస్ట్ ఇయర్ తొలిప్రేమ తో మరో హిట్ కొట్టిన వరుణ్ తేజ్ తర్వాత అంతరిక్షం తో పర్వాలేదు అనిపించినా తర్వాత సంక్రాంతి కి మల్టీ స్టారర్ ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ కొట్టాడు.
ఇక ఇప్పుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో వాల్మీకి అంటూ సరికొత్త క్యారక్టర్ తో రాబోతున్నాడు వరుణ్ తేజ్, తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన జిగత్తాండ సినిమా కి తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో అనేక మార్పులు చేర్పులు చేశారు హరీష్ శంకర్.
కాగా అన్ని మార్పులు చేసుకున్న తర్వాత ఫైనల్ గా సినిమా రన్ టైం చూసుకోగా 2 గంటల 50 నిమిషాలకు పైగా రన్ టైం ఉందని సమాచారం. అంత పెద్ద లెంత్ అంటే కొంచం రిస్క్ అనే చెప్పుకోవాలి. పైగా ఇందులో వరుణ్ తేజ్ నెగటివ్ రోల్ ఎక్కువగా ఉంటుంది…
మరో హీరోగా అతర్వ నటిస్తుండగా తెలుగు ఆడియన్స్ కి ఆటను పెద్దగా పరిచయం లేని నటుడు, హీరోయిన్ కూడా కొత్తమ్మాయే. దాంతో భారం మొత్తం వరుణ్ తేజ్ మోయాల్సి వస్తుంది. కానీ ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటం తో సినిమా పై బజ్ బాగానే ఉంది.
దాంతో లెంత్ ఎంతైనా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా దంచికొట్టడం ఖాయం అన్న భావన లో టీం మొత్తం ఉందని తెలుస్తుంది. మరో ఆసక్తికరమైన న్యూస్ ఏంటి అంటే గబ్బర్ సింగ్ లో లాగానే అంత్యాక్షరి ఎపిసోడ్ ని ఇందులో కూడా పెట్టారట. ఆ ఎపిసోడ్ ఓ రేంజ్ లో వచ్చిందని టాక్. దాంతో లెంత్ గురించి పట్టుంచుకోకుండా టీం మొత్తం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు సమాచారం…