Home న్యూస్ 45 కోట్ల సినిమా…పైల్వాన్ మూవీ టోటల్ బిజినెస్ ఇంతేనా!

45 కోట్ల సినిమా…పైల్వాన్ మూవీ టోటల్ బిజినెస్ ఇంతేనా!

1687
0

      కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ అందరికీ పరిచయమే… కన్నడ లో స్టార్ హీరోగా ఉంటూనే ఇక్కడ ఈగతో రచ్చ చేశాడు. ఇప్పుడు సైరా లో ఒక ముఖ్య పాత్ర ని పోషిస్తున్నాడు. ఇక సుదీప్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పైల్వాన్ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా సినిమా అఫీషియల్ బిజినెస్ క్లియర్ గా రివీల్ చేయలేదు కానీ ట్రేడ్ లో వినిపిస్తున్న బిజినెస్ మాత్రం ఈ విధంగా ఉంది.

సినిమా ను మొత్తం మీద 45 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించారని సమాచారం. కన్నడ ఇండస్ట్రీ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సినిమాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచిందని అంటున్నారు. ఇక సినిమా బిజినెస్ ట్రేడ్ లెక్కల ప్రకారం మొత్తం మీద…

అన్ని భాషలలో కలిపి 30 కోట్ల రేంజ్ లోనే జరిగిందని సమాచారం. అందులో కర్ణాటక లో కొన్ని ఏరియాల్లో సినిమాను ఓన్ గా రిలీజ్ చేస్తున్నారట. మిగిలిన ఏరియాల బిజినెస్ కౌంట్ మొత్తం మీద 20 కోట్ల వరకు ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమా హిందీ బిజినెస్ మొత్తం మీద 4 కోట్ల దాకా పలికిందట.

ఇక తెలుగు రాష్ట్రాలలో సినిమా బిజినెస్ 2.2 కోట్ల వరకు దక్కిందని సమాచారం. ఇక ఇండియా లో మిగిలిన చోట్ల మొత్తం మీద సినిమా కి 1.8 కోట్ల దాకా బిజినెస్ జరిగిందట. ఇక ఓవర్సీస్ మొత్తం మీద 2 కోట్ల దాకా సినిమా బిజినెస్ సొంతం చేసుకోగా టోటల్ బిజినెస్ 30 కోట్ల దాకా ఉందని సమాచారం.

అంటే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే వరల్డ్ వైడ్ గా 31 కోట్లకు తగ్గకుండా కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది. తెలుగు లో క్లీన్ హిట్ అవ్వాలి అంటే సినిమా 2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 3000 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతుందట. మరి సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here