Home న్యూస్ డిసెంబర్ 31 న విడుదల కాబోతున్న వరలక్ష్మి శరత్ కుమార్ ‘చేజింగ్’ చిత్రం!

డిసెంబర్ 31 న విడుదల కాబోతున్న వరలక్ష్మి శరత్ కుమార్ ‘చేజింగ్’ చిత్రం!

0

క్రాక్, నాంది, యశోద సినిమా లతో ప్రేక్షకులను అలరించి మంచి గుర్తింపు సంపాదించుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. తన పాత్రలో వైవిధ్యత ఉండేలా చూసుకుంటూ స్టార్ నటిగా ఎదుగుతున్న వరలక్ష్మి నటిస్తున్న తాజా చిత్రం ఛేజింగ్.

సీనియర్‌ హీరో శరత్‌ కుమార్‌ కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసి వెండితెరపై తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ విభిన్నమైన పాత్రలతో స్పెషల్ క్రేజ్ అందుకుంది. పాజిటివ్ రోల్స్ తో పాటు నెగిటివ్ రోల్స్ కూడా చేస్తూ  తమిళ, తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీ చేంజింగ్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది  వరలక్ష్మి శరత్ కుమార్.

ఈ సినిమాకు  కె. వీరకుమార్‌ దర్శకత్వం వహించగా మదిలగన్‌ మునియాండి నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు లో  శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌ పతాకం పై ఏఎన్ బాలాజీ ఈ సినిమా ను విడుదల చేస్తున్నారు. తాషి సంగీతం సమకూర్చగా ఈ సినిమా కి E కృష్ణస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ఇప్పటికే తమిళంలో మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమా ను తెలుగు లో డిసెంబర్ 31 వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ మేరకు మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here