Home న్యూస్ వర్షం4K రీ రిలీజ్….2 రోజుల్లో ఎంత వచ్చిందంటే!!

వర్షం4K రీ రిలీజ్….2 రోజుల్లో ఎంత వచ్చిందంటే!!

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ మూవీ వర్షం. 2004 టైం లో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసిన ఈ సినిమా ప్రభాస్ కి బిగ్ టర్నింగ్ పాయింట్ లా నిలిచింది. అలాంటి ఈ సినిమాను రీసెంట్ గా టాలీవుడ్ లో మొదలైన రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేయాలని….

ట్రై చేశారు కానీ అప్పటికే బిల్లా మరియు రెబల్ సినిమాలు స్పెషల్ రిలీజ్ లు ఉండటంతో ఈ సినిమాను నవంబర్ కి పోస్ట్ పోన్ చేశారు. కాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 80 థియేటర్స్ లో రీ రిలీజ్ ను సొంతం చేసుకుంది.

హైదరాబాదు లో RTC X రోడ్స్ లో అలాగే మరి కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులతో ఓపెన్ అయిన ఈ సినిమా మొదటి రోజు ఓవరాల్ గా 15 లక్షల మేర గ్రాస్ ను అందుకోగా రెండో రోజు కి వచ్చే సరికి ఆల్ మోస్ట్ 11 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.

టోటల్ గా 2 రోజుల్లో సినిమా కి 26 లక్షల మేర గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా చెప్పాలి అంటే సినిమా రీ రిలీజ్ లో 2 రోజుల్లో ప్రజెంట్ అన్ సీజన్ ఎఫెక్ట్ ఉన్నా కానీ సాలిడ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. మరి కొన్ని రోజులు థియేటర్స్ లో ఉండబోతున్న సినిమా ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here