Home గాసిప్స్ గని కి ఇంత బడ్జెట్ అయిందా….వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!!

గని కి ఇంత బడ్జెట్ అయిందా….వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీ గద్దల కొండ గణేష్ వచ్చి ఆల్ మోస్ట్ 2 ఏళ్లకి చేరువ అవుతూ ఉండగా ఈ గ్యాప్ లో గని సినిమా కోసం బాడీ బిల్డింగ్ చేసే పనిలో ఉన్న వరుణ్ తేజ్ ఎఫ్ 3 సినిమా ను కూడా సైన్ చేసి ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఈ సమ్మర్ లో బాక్ టు బాక్ మూవీస్ తో సందడి చేయడానికి సిద్ధం అవుతున్నాడు…

ముందుగా గని సినిమా ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ వాళ్ళు భారీ బడ్జెట్ తో తెరకెక్కించినట్లు ట్రేడ్ లో టాక్ వినిపిస్తుంది. క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా ను…

రూపొందించారని దానికి తోడూ చాలా టైం నుండి సినిమా షూటింగ్ లో ఉండటం ఈ గ్యాప్ లో వేవ్ ల వలన ఇబ్బందులు కూడా రావడంతో బడ్జెట్ వరుణ్ తేజ్ ప్రజెంట్ మార్కెట్ కన్నా కూడా ఎక్కువగా అయిందని అంటున్నారు. టోటల్ గా బడ్జెట్ ఈ సినిమా కి గాను… 45 కోట్ల నుండి 50 కోట్ల రేంజ్ దాకా…

జరిగిందని అంటూ ఉండటం ఆశ్యర్యాన్ని కలిగించక మానదు అని చెప్పాలి. ఈ రేంజ్ బడ్జెట్ అంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ తో చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకు వచ్చింది అంటున్నారు. ఇక ఈ సినిమా కన్నా ముందు 7-8 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే వరుణ్ తేజ్….

ఈ సినిమా కోసం 10 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని అంటూ ఉండగా అప్ కమింగ్ మూవీస్ కి రెమ్యునరేషన్ ఇంకా పెంచి 12 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఒక్కో సినిమాను తీసుకోబోతున్నారని టాలీవుడ్ ట్రేడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రేంజ్ బడ్జెట్ అండ్ రెమ్యునరేషన్ కి తగ్గట్లు గని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here