Home న్యూస్ ప్రాణం పెట్టేస్తున్న వరుణ్ తేజ్……గట్టిగా కొట్టాలి సామి!!

ప్రాణం పెట్టేస్తున్న వరుణ్ తేజ్……గట్టిగా కొట్టాలి సామి!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర సోలో హీరోగా బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine) సినిమా ఆడియన్స్ ముందుకు మార్చ్ 1 న రిలీజ్ అవ్వడానికి సిద్దం అవుతూ ఉండగా సినిమా మీద పర్వాలేదు అనిపించేలా బజ్ అయితే ఉంది కానీ…

సినిమా జానర్ తెలుగు ఆడియన్స్ కి సెట్ అయ్యే అవకాశం తక్కువే ఉండగా సినిమా గురించి జనాలలో రీచ్ అండ్ క్రేజ్ తేవడానికి వరుణ్ తేజ్ ఏమేమి చేయాలో అన్నీ చేస్తూ ఉండటం విశేషం… బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా వరుణ్ తేజ్ నటించిన గని, గాండీవదారి అర్జున లాంటి వరుస ఫ్లాఫ్స్ తర్వాత….

ఎలాగైనా హిట్ కొట్టి తన మార్కెట్ ను స్టేబుల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా ఇలాంటి టైం లో చేసిన ఎక్స్ పెరిమెంటల్ మూవీ అయిన ఆపరేషన్ వాలంటైన్ కి ప్రస్తుత పరిస్థితులు పెద్దగా అనుకూలంగా లేవు అనే చెప్పాలి, సినిమా జానర్ పై ఆడియన్స్ లో పెద్దగా ఆసక్తి లేదు…. ఈ జానర్ తో ఆల్ రెడీ రీసెంట్ గా….

హృతిక్ రోషన్ ఫైటర్ సినిమా రిలీజ్ అయ్యింది… ప్రస్తుతం వరుణ్ తేజ్ పెద్దగా ఫామ్ లో లేడు, ఇలా అవరోధాలు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఇప్పుడు ప్రాణం పెట్టేసి అన్ని చోట్లా ప్రమోషన్స్ ను చేస్తూనే ఉన్నాడని చెప్పాలి. నార్త్ నుండి సౌత్ లోకల్ మీడియా ఎడాపెడా అన్ని చోట్లకు వెళుతూ…

సినిమాను ఎంతలా ప్రమోట్ చేయాలో అంతలా చేస్తున్నాడు…. ఈ రేంజ్ లో ప్రమోషన్స్ రీసెంట్ టైంలో పాన్ ఇండియా మూవీస్ కూడా జరగలేదు అనే చెప్పాలి. అలాంటి ప్రమోషన్స్ చేసి ఎలాగైనా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిస్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్ ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అయ్యి సాలిడ్ కంబ్యాక్ ను దక్కించుకుంటాడో లేదో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here