Home న్యూస్ బాక్స్ ఆఫీస్ పోటిలో బాలయ్య Vs ఎన్టీఆర్….ఏమవుతుందో ఇక!

బాక్స్ ఆఫీస్ పోటిలో బాలయ్య Vs ఎన్టీఆర్….ఏమవుతుందో ఇక!

0

రీసెంట్ టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ ల ట్రెండ్ ఒకటి రెండేళ్ళలో బాగానే ట్రెండ్ అయినా కూడా మళ్ళీ స్లో డౌన్ అయింది…కానీ రీసెంట్ గా ఓయ్ మూవీ రీ రిలీజ్ మళ్ళీ జనాలను థియేటర్స్ రప్పించడంతో తిరిగి ఒక్కోటిగా మళ్ళీ రీ రిలీజ్ లు మొదలు పెడుతూ ఉన్నారు… ఈ క్రమంలో ఆల్ రెడీ రీ రిలీజ్ అయిన…

సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, వర్షం లాంటి కొన్ని సినిమాలు మళ్ళీ రీ రిలీజ్ అవ్వగా ఇప్పుడు మార్చ్ 1 మరియు 2 తేదీలలో ఒక రీ రీ రిలీజ్ మూవీ అలాగే ఒక కొత్త రీ రిలీజ్ మూవీలు పోటి పడబోతున్నాయి… అవి నందమూరి ఫ్యామిలీ నుండి వస్తూ ఉండటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు…

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన బ్లాక్ బస్టర్ సమర సింహా రెడ్డి(Samara Simha Reddy) సినిమా అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి(Simhadri Movie)లు మార్చ్ 1 మరియు 2 తేదీలలో రిలీజ్ కానున్నాయి…. రెండు సినిమాలు కూడా ఫ్యాన్స్ కోరిక మేరకు….

ఏమీ రీ రిలీజ్ అవ్వడం లేదు….సమరసింహారెడ్డి రిలీజ్ అయ్యి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా రీ రిలీజ్ చేస్తూ ఉండగా అదే టైంలో సింహాద్రి ని కూడా రిలీజ్ చేస్తున్నారు… మరియు ఫ్యాన్స్ ఈ రెండు సినిమాలకు గ్రాండ్ గా థియేటర్స్ ఎలా వెల్కం చెబుతారో అన్నది ఆసక్తిగా మారింది. వీటితో పాటు మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) బ్లాక్ బస్టర్ మూవీ…

కిక్(Kick Movie) కూడా మార్చ్ 1 నే రీ రిలీజ్ కానుంది. దాంతో మార్చ్ ఫస్ట్ వీకెండ్ కొత్త సినిమాలతో పాటు ఈ సినిమాల రీ రిలీజ్ సందడి బాక్స్ ఆఫీస్ దగ్గర జనాలను ఎంతవరకు థియేటర్స్ కి రప్పించి అన్ సీజన్ లో బాక్స్ ఆఫీస్ కళకళలాడేలా చేస్తుందో లేదో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here