Home న్యూస్ వెంకీ మామ రివ్యూ…ప్లస్&మైనస్ పాయింట్స్…బాబీ దెబ్బేశాడు!!

వెంకీ మామ రివ్యూ…ప్లస్&మైనస్ పాయింట్స్…బాబీ దెబ్బేశాడు!!

0

విక్టరీ వెంకటేష్ నాగ చైతన్యల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వెంకీ మామ భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, రిలీజ్ కి ముందు నుండే సినిమాపై మంచి బజ్ మొదలు అయింది, దానికి కారణం సినిమా పాటలు అండ్ ట్రైలర్ ఆడియన్స్ కి భారీగా నచ్చడం, ఇక నేడు వరల్డ్ వైడ్ గా 1000 కి అటూ ఇటూ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ విషయానికి వస్తే…చిన్నప్పుడే పేరెంట్స్ ని కోల్పోయిన నాగ చైతన్య ని మేన మామ వెంకటేష్ అన్నీ తానై పెంచుతాడు. పెరిగి పెద్దయ్యాక ఇద్దరు స్నేహితుల్లా ఉండగా అనుకోని కారణాల వలన చిన్న ఇస్స్యూస్ రావడం తో నాగ చైతన్య మావయ్య కి చెప్పకుండా మిలటరీ లో జాయిన్ అవుతాడు.

మిలటరీ లో జాయిన్ అయ్యాక ఏం అయింది, మేనల్లుడిని వెతుక్కుంటూ వెళ్ళిన మావయ్యా తిరిగి మేనల్లుడిని కలిశాడా, అసలు వీళ్ళకి గొడవ ఎందుకు అయింది… ఇలాంటివన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇవి కాకుండా సినిమాలో మరిన్ని ఉపకథలు ఉన్నాయి, అవి థియేటర్స్ లో చూడాల్సిందే.

ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వెంకటేష్ మరియు నాగ చైతన్య ల పెర్ఫార్మెన్స్ అద్బుతంగా ఉంది, ముఖ్యంగా వెంకీ దుమ్ము లేపేశాడు, కామిక్ టైమింగ్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ రాఫ్ఫాడించాడు. ఇక నాగ చైతన్య కి మరీ అద్బుతమైన రోల్ దొరకలేదు కానీ ఉన్నంతలో ఓకే అనిపించుకున్నాడు.

ఇద్దరు హిరోలకి కొన్ని ఎలివేషన్ సీన్స్ పడగా రెండూ హైలెట్ అయ్యాయి. ఇక హీరోయిన్స్ ఇద్దరు ఉన్నంతలో ఆకట్టుకోగా గ్లామర్ తో కూడా మెప్పిస్తారు, హీరోలతో వీళ్ళ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది, ఇక మిగిలిన నటీనటుల్లో హైపర్ ఆది కామెడీ అక్కడక్కడా వర్కౌట్ కాగా మిగిలిన రోల్స్ పరిది మేర ఉంటాయి.

VenkyMama Total Pre Release Business

ఇక సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయం లో తమన్ కుమ్మేశాడు, 2 పాటలు మాస్ కి ఫీస్ట్ గా ఉండగా ఫైట్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉంది, ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఓ రేంజ్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు తమన్, ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు బాగా ఉండగా…

సెకెండ్ ఆఫ్ హైలెట్ అవుతుంది అనుకున్న మిలటరీ ఎపిసోడ్ కానీ తర్వాత ఎమోషనల్ సీన్స్ కానీ బాగా లాగ్ అయ్యాయి. ఇక సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా విజువల్స్ చాలా బాగా వచ్చాయి, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి అని చెప్పాలి. ఇక డైరెక్షన్ పరంగా… బాబీ సక్సెస్ కాలేక పోయాడు.

తనదగ్గర ఇద్దరు హిట్లు కొట్టి జోరు మీదున్న హీరోలు ఉండగా వాళ్ళతో మల్టీ స్టారర్ అంటే ఆడియన్స్ ఎమోషనల్ సీన్స్ ఆర్మీ సీన్స్ లాంటివి కాదు, ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని ఆశిస్తారు, ఆ విషయం లో బాబీ ఫస్టాఫ్ వరకు అక్కడక్కడా మెప్పించినా సెకెండ్ ఆఫ్ లో పూర్తిగా విఫలం అయ్యాడు.

సినిమాకి హైలెట్ అవుతుంది అనుకున్న ఆర్మీ ఎపిసోడ్ మైనస్ అయింది, తర్వాత ఎమోషనల్ సీన్స్ ఓ 20 ఏళ్ల క్రితం మూవీస్ లో ఎలా ఉంటాయో అలా ఆడియన్స్ యిట్టె చెప్పే విధంగా ఉండటం, అవి కూడా భారీగా లాగ్ అవ్వడం పూర్తిగా డైరెక్షన్ ఫాల్ట్ అనే చెప్పాలి.

ఇక సినిమాలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే….. ఇద్దరు హీరోల స్క్రీన్ ప్రజెన్స్, 2 మాస్ సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ ఎపిసోడ్, కొన్ని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ అని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ లో కథ, ఆర్మీ ఎపిసోడ్, లాగ్ సెకెండ్ ఆఫ్, డైరెక్షన్ మైనస్ ల కింద వస్తాయి.

ఉన్నంతలో వెంకీ పెర్ఫార్మెన్స్ కోసం ఇద్దరు హీరోల స్క్రీన్ ప్రజెన్స్ అండ్ ఫస్టాఫ్ కోసం ఈజీ గా ఒకసారి చూడొచ్చు, సెకెండ్ ఆఫ్ ని కొంచం బెటర్ గా డీల్ చేసి ఉంటె అక్కినేని అండ్ దగ్గుబాటి ఫ్యామిలీస్ కి ఓ మరుపురాని మూవీ అయ్యేది వెంకీమామ సినిమా..

ఫైనల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ [2.75 స్టార్స్]…. కామన్ ఆడియన్స్ ఒకసారి చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఒకసారి చూసే విధంగా సినిమా ఉంది. ఇక ఫ్యాన్స్ ని ఫుల్ గా సాటిస్ ఫై చేయకున్నా ఉన్నంతలో కొద్ది వరకు మెప్పిస్తుంది ఈ సినిమా..

Venky Mama Bookings Report...First Day Collections Prediction

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here