Home న్యూస్ విడుదల పార్ట్-1 ఫస్ట్ డే కలెక్షన్స్…కుమ్మిందిగా సినిమా!!

విడుదల పార్ట్-1 ఫస్ట్ డే కలెక్షన్స్…కుమ్మిందిగా సినిమా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వెట్రి మారన్ డైరెక్షన్ లో వచ్చిన విడుదల పార్ట్ 1 సినిమా సూపర్ సక్సెస్ తర్వాత తెలుగు లో రీసెంట్ గా డబ్ అయ్యి మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. సినిమా ఎక్స్ పెరిమెంటల్ కంటెంట్ తో తెరకేక్కినా కానీ టాక్ బాగుండటంతో జనాలు బాగానే థియేటర్స్ కి వచ్చి సినిమాను చూశారు అని చెప్పాలి మొదటి రోజున…

దాంతో సినిమా మొదటి రోజు సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది లిమిటెడ్ రిలీజ్ లో కూడా… సినిమా ఓవరాల్ గా మొదటి రోజు నైజాంలో 45 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ గా ఆంధ్ర సీడెడ్ లలో మరో….

60 లక్షల లోపు గ్రాస్ ను మొదటి రోజు అందుకుందని సమాచారం, దాంతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 1.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని సినిమా సొంతం చేసుకోగా వర్త్ షేర్ అటూ ఇటూగా 45 లక్షల రేంజ్ లో ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా అని చెప్పాలి.

ఎక్స్ లెంట్ స్టార్ట్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న విడుదల పార్ట్ 1 సినిమా రెండో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో మరోసారి బెటర్ గా జోరు చూపించే అవకాశం ఉంది. ఇక సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ వివరాలు వీకెండ్ తర్వాత క్లియర్ గా అప్ డేట్ చేస్తాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here