Home న్యూస్ విడుదల పార్ట్ 1 షార్ట్ రివ్యూ…సినిమా ఎలా ఉందంటే!!

విడుదల పార్ట్ 1 షార్ట్ రివ్యూ…సినిమా ఎలా ఉందంటే!!

0

నారప్ప సినిమా ఒరిజినల్ వర్షన్ అసురన్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్షన్ లో కమెడియన్ సూరి ప్రధాన పాత్రలో విజయ్ సేతుపతి కీలక రోల్ లో నటించిన సినిమా విడుదల పార్ట్ 1 ఆడియన్స్ ముందుకు ఈ మధ్యనే తమిళ్ లో రిలీజ్ అయ్యి అద్బుత విజయాన్ని సాధించిన తర్వాత తెలుగులో ఈ సినిమాను డబ్ చేసి రీసెంట్ గా రిలీజ్ చేశారు. మరి ఇక్కడ ఆడియన్స్ కి సినిమా ఎంతవరకు కనెక్ట్ అయ్యిందో తెలుసుకుందాం పదండీ… ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే…. ట్రైనింగ్ లో ఫస్ట్ వచ్చినా కేవలం…

టిఫిన్ బాక్సుల డిలివరీకే పరిమితం అయ్యే హీరో అనుకోకుండా పోలీసులు ఎప్పటి నుండో పట్టుకోవాలి అనుకుంటున్న ప్రజాధలం హెడ్ అయిన విజయ్ సేతుపతిని చూస్తాడు… ఆ తర్వాత కథలో ఏమేమి ట్విస్ట్ లు టర్న్ లు జరిగాయి అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… డబ్బింగ్ మూవీస్ లో కామెడీ రోల్స్ తో మనకు పరిచయం అయిన సూరి ఈ సారి సీరియస్ రోల్ లో అద్బుతంగా నటించి మెప్పించగా విజయ్ సేతుపతి కూడా మరోసారి అద్బుత నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన యాక్టర్స్ బాగానే నటించగా…

సినిమా లెంత్ ఎక్కువ అవ్వడం, తమిళ్ ఫ్లేవర్ మరీ ఎక్కువగా ఉండటం, రియలస్టిక్ స్టొరీ అంటూ చెప్పడంతో కొన్ని సీన్స్ ని చూపించిన విధానం కొంచం ఇబ్బంది పెడుతుంది. కానీ ఇలాంటి డిఫెరెంట్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కొంచం స్లో నరేషన్ ని తట్టుకుంటే ఒక మంచి సినిమానే చూసిన ఫీలింగ్ ఈ సినిమా ఇవ్వడం ఖాయం… మరో సారి డిఫెరెంట్ కాన్సెప్ట్ ను ఎంచుకున్న…

వెట్రిమారన్ చాలా వరకు ఇంప్రెస్ చేయగా తమిళ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన సినిమా తెలుగు ఆడియన్స్ లో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని మెప్పించే అవకాశం ఉంది. మిగిలిన ఆడియన్స్ కూడా కొంచం ఓపికతో చూస్తె బాగుంది అనిపించేలా మెప్పించవచ్చు… ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here