కోలీవుడ్ లో అల్టిమేట్ క్రేజ్ ఉండి టాలీవుడ్ లో మిగిలిన కోలీవుడ్ హీరోలతో పోల్చితే పెద్దగా క్రేజ్ ని సొంతం చేసుకోలేక పోయిన స్టార్ హీరో ఇళయ ధలపతి విజయ్ మెల్లి మెల్లిగా తెలుగు లో కూడా సినిమా సినిమా కి దుమ్ము లేపుతున్నాడు…. తుపాకి, జిల్లా లాస్ట్ ఇయర్ మెర్సల్ సినిమాలు తెలుగు లో కూడా మంచి వసూళ్లు సాధించాయి. దాంతో విజయ్ మురగదాస్ ల కాంబో లో వస్తున్న సర్కార్ పై అంచనాలు పెరిగి పోయాయి.
కాగా ఈ సినిమా రిలీజ్ కి నెల ముందే తెలుగు లో 6 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకుందని వార్తలు రాగా… ఇప్పుడు బిజినెస్ లెక్క ఏకంగా 7.5 కోట్ల రేంజ్ లో ఉండటం షాక్ ని కలిగిస్తుంది. నైజాం లో 3.6 కోట్లు, సీడెడ్ లో 2 కోట్లు, టోటల్ ఆంధ్రా లో 1.9 కోట్ల రేంజ్ లో సినిమా బిజినెస్ జరిగిందట.
దాంతో తెలుగు లో మొత్తం మీద సినిమా 7.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని అందుకుంది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ లో ఈ సినిమా ఇప్పుడు 8.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగబోతుంది. మరి ధలపతి తెలుగు లో కూడా సత్తా చాటి ఈ బిజినెస్ ని వెనక్కి తెస్తాడో లేదో చూడాలి.