Home న్యూస్ అరవింద సమేత 20 వ రోజు కలెక్షన్స్..ఇక కష్టమే!

అరవింద సమేత 20 వ రోజు కలెక్షన్స్..ఇక కష్టమే!

0

      టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకుందని ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు నిర్మాతల నుండి కానీ ట్రేడ్ నుండి కానీ దీని పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేదు. బయట సర్క్యులేట్ అవుతున్న పోస్టర్స్ అన్నీ ఫ్యాన్స్ క్రియేటివిటీ… ఇక సినిమా 19 రోజుల్లో టోటల్ గా రెండు రాష్ట్రాల్లో 72.8 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 97.58 కోట్ల షేర్ ని అందుకుంది.

ఇక సినిమా 20 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రాష్ట్రాలలో 19 వ రోజు తో పోల్చితే 50% కి పైగా డ్రాప్స్ ని సాధించింది. దానికి తోడు 3 వ వారం 330 థియేటర్స్ లో కొనసాగుతున్న సినిమా 20 వ రోజుకి వచ్చే సరికి 200 లోపు థియేటర్స్ కి చేరింది.

ఆ ప్రభావం కూడా కలెక్షన్స్ పై పడటంతో మొత్తం మీద సినిమా 20 వ రోజు భారీ డ్రాప్స్ నే సాధించింది. ఓవరాల్ గా సినిమా 20 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 10 లక్షల నుండి 12 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. దాంతో 100 కోట్ల ఆశలు కష్టంగా మారాయి.

ఇక రామ్ నటించిన హెలో గురు ప్రేమ కోసమే 12 రోజుల్లో 20.4 కోట్ల షేర్ ని అందుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇక 13 వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సుమారు 15 లక్షల రేంజ్ షేర్ ని అందుకోవచ్చని సమాచారం.

ఇక విశాల్ పందెం కోడి 2 బాక్స్ ఆఫీస్ దగ్గర 12 రోజుల్లో 6.58 కోట్ల దాకా షేర్ ని అందుకోగా 13 వ రోజు మరింత స్లో డౌన్ అయింది. దాంతో ఈ రోజు సినిమా కలెక్షన్స్ 5 లక్షల లోపే ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇవీ మొత్తం మీద దసరా సినిమాల ఈ రోజు బాక్స్ ఆఫీస్ అప్ డేట్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here