Home న్యూస్ “విజయ్ సేతుపతి” రివ్యూ….పారిపోండిరోయ్!!

“విజయ్ సేతుపతి” రివ్యూ….పారిపోండిరోయ్!!

0

       విలక్షణ నటుడిగా కోలివుడ్ లో మంచి పేరు తెచ్చుకుని స్టార్ గా ఎదిగిన హీరో విజయ్ సేతుపతి, సైడ్ రోల్స్ నుండి మెయిన్ రోల్స్ కి తర్వాత తనవల్లె సినిమాలు ఆడే రేంజ్ కి ఎదిగిన విజయ్ సేతుపతి రీసెంట్ గా మెగాస్టార్ సైరా లో చేసిన రోల్ తో తెలుగు ఆడియన్స్ కి చేరువ అయ్యారు, దాంతో ఇప్పుడు తమిళ్ రిలీజ్ అయిన “సంగ తమిళన్” సినిమాను తెలుగు లో విజయ్ సేతుపతి పేరుతొ డబ్ చేసి రిలీజ్ చేశారు.

సినిమా 15 న రిలీజ్ అవ్వాల్సి ఉన్నా చాలా తక్కువ ప్లేసు లలో మాత్రమె రిలీజ్ అయింది 16న అన్ని చోట్లా సజావుగా రిలీజ్ అయిన సినిమా ప్రేక్షకులను అలరించిందా లేదా తెలుసుకుందాం పదండీ. ముందుగా కథ పాయింట్ కి వస్తే ఒక ఊరు… అక్కడా కొత్తగా…

పెట్టబోతున్న ఒక ఫ్యాక్టరీ వలన కాలుష్యం పెరిగి అనర్ధాలు జరుగుతాయి పోరాడిన హీరో మరియు హీరో తండ్రి ని చంపేశారని, హీరో లా ఉన్న మరో వ్యక్తీకి చెబుతారు, నటుడు అవ్వాలనుకుంటున్న ఆ వ్యక్తీ ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని హీరో ప్లేస్ లో వెళతాడు. తర్వాత ఏం అయింది, అసలు వాళ్ళని ఎవరు చంపారు, అక్కడ నటించడానికి వెళ్ళిన….

హీరోకి ఎలాంటి అడ్డంకులు ఎదురు అయ్యాయి, హీరోయిన్స్ రోల్స్ ఏంటి అనేవి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే, సినిమా స్టొరీ లైన్ వింటుంటే చాలా సినిమాలు గుర్తుకి రాక మానవు, ఎన్నాళ్ళుగానో ఇలాంటి కమర్షియల్ ఫ్లాట్ తో కూడుకున్న కథలను చూసి చూసి ఉన్న మనకు ఈ కథ కొత్తగా ఏమి అనిపించదు.

పైపెచ్చు సినిమా కొన్ని సీన్స్ తప్పితే చాలా వరకు బోర్ సీన్స్ తో విసుగు తెప్పిస్తుంది, దానికి తోడూ తమిళ్ ఫ్లేవర్ ఎక్కువ అవ్వడం తో మనకు ఏమాత్రం కనెక్ట్ కాదు, ఉన్నంతలో రాశిఖన్నా మరియు హీరో లవ్ స్టొరీ కొంచం ఆకట్టుకోగా నివేత పెతురాజ్ కూడా మెప్పిస్తుంది.

మిగిలిన నటీనటుల్లో సూరి కామెడి కొంచం ఆకట్టుకున్నా సినిమా చాలా వరకు బోర్ సీన్స్ తో నిండిపోయి సహనానికి పరీక్ష పెడుతుంది, రొటీన్ మూవీ నే అయినా విజయ్ సేతుపతి కొద్ది వరకు ఆకట్టుకున్నా సినిమా కథ లో దమ్ము లేకపోవడం తో పెద్దగా చేయడానికి ఏమి లేకపోలేదు.

ఉన్నంతలో ఇంట్రో ఫైట్ సీన్ తో కొన్ని యాక్షన్ సీన్స్ లో అలాగే కొంత పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఎడిటింగ్, సంగీతమ్, స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్నీ చాలా వీక్ గా ఉన్నాయని చెప్పొచ్చు. పక్కా తమిళ్ ఫ్లేవర్ ఉన్న సినిమా తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం కష్టమే..

ఓవరాల్ గా సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ [2.25 స్టార్స్]… కొన్ని మంచి సీన్స్ కోసం రెండున్నర గంటల పాటు సినిమాను భరించే ఓపిక ఉంటే సినిమాకి వెళ్ళొచ్చు. లేదంటే ఈజీ స్కిప్ చేసే సినిమా ఈ “విజయ్ సేతుపతి”… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here