Home న్యూస్ ఫ్లాపుల్లో ఉన్నా ఇదేం బిజినెస్ సామి….ఊరమాస్ అంటే ఇదే!!

ఫ్లాపుల్లో ఉన్నా ఇదేం బిజినెస్ సామి….ఊరమాస్ అంటే ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ క్లీన్ హిట్ కొట్టి ఏళ్ళు అవుతున్న యాక్షన్ హీరో గోపీచంద్ లాస్ట్ ఇయర్ సీటిమార్ సినిమాతో మెప్పించినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గీతని ఆ సినిమా దాటలేక పోయింది, కానీ అంతకన్నా ముందు వచ్చిన వరుస ఫ్లాఫ్ మూవీస్ తో పోల్చితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా బెటర్ రిజల్ట్ నే గోపీచంద్ కి సొంతం అయ్యేలా చేసింది అని చెప్పాలి ఓవరాల్ గా…

ఈ సినిమా తర్వాత గోపీచంద్ టాలెంటెడ్ డైరెక్టర్ మినిమమ్ గ్యారెంటీ సినిమాలు ఇస్తాడన్న నమ్మకం ఉన్న మారుతి డైరెక్షన్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్ మూవీ ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉందన్న విషయం తెలిసిందే.

కాగా సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మినిమమ్ ఎంటర్ టైన్ మెంట్ ఉండేలా ఉందనిపించిన సినిమా క్వాలిటీ పరంగా మాత్రం కుమ్మేసింది. గీతా ఆర్ట్స్, యు వి క్రియేషన్స్, మారుతి, ఇలా అన్నీ మినిమమ్ గ్యారెంటీ ఉన్న పేర్లు ఉండటంతో బిజినెస్ కూడా అనుకున్న దాని కన్నా ఎక్కువే జరుగుతుంది ఈ సినిమా కి…

సినిమా రీసెంట్ గా కోస్టల్ ఆంధ్ర ఏరియా బిజినెస్ ను కంప్లీట్ గా పూర్తీ చేసుకుంది, ఓవరాల్ గా సినిమా కి కోస్టల్ ఆంధ్రలో 9 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమచారం. గోపీచంద్ కెరీర్ లోనే రీసెంట్ టైం లో ఇది ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ అని చెప్పాలి. ఇక నైజాం మరియు సీడెడ్ ఏరియాల బిజినెస్ లెక్కలు…

ఇంకా బయటికి రావాల్సి ఉండగా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల బిజినెస్ తన కెరీర్ లోనే హైయెస్ట్ అనిపించేలా ఉండటం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు. ఎలాగూ పెద్దగా పోటి ఏమి లేకుండా రిలీజ్ అవుతున్న సినిమా అవ్వడంతో పాజిటివ్ టాక్ వస్తే ఇక బాక్స్ ఆఫీస్ ను ఈ సినిమా షేక్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here