బిచ్చగాడు సినిమా తో తెలుగు లో ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్న విజయ్ ఆంథోని తెలుగు లో మళ్ళీ అలాంటి విజయాన్ని సొంతం చేసుకోలేదు కానీ అప్పట్లో కిల్లర్ అనే సినిమా తో ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేశాడు… బిచ్చగాడు తర్వాత భేతాలుడు సినిమా భారీ హైప్ నడుమ వచ్చినా అంచనాలను అందుకోలేదు.. అయినా తన సినిమాలను క్రమం తప్పకుండా తెలుగు లో కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్న విజయ్ ఆంథోని…
నటించిన కొత్త సినిమా విజయ రాఘవన్ సినిమా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు తమిళ్ తో పాటు తెలుగు లో శుక్రవారం రిలీజ్ కాబోతుండగా ఈ సినిమా తెలుగు లో డీసెంట్ రిలీజ్ ను పోటి ఉన్నప్పటికీ కూడా సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద…
1.3 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుందని సమాచారం… వరుస ఫ్లాఫ్స్ పడుతున్నా ఇది డీసెంట్ బిజినెస్ అనే చెప్పాలి. ఇక థియేటర్స్ ని గమనిస్తే… నైజాం లో 86 థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా టోటల్ ఆంధ్రలో 170 థియేటర్స్ లో…
రిలీజ్ కానుండగా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 255 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది… ఇక సినిమా తెలుగు లో క్లీన్ హిట్ అవ్వాలి అంటే 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా తమిళ్ లో ఈ సినిమా ను డీసెంట్ అనిపించే రేంజ్ లో పబ్లిసిటీ తో రిలీజ్ చేస్తుండగా సినిమా అక్కడ 3.2 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను…
సొంతం చేసుకుందని అంటున్నారు.. ఆ లెక్కన సినిమా అక్కడ హిట్ అవ్వాలి అంటే 6 కోట్ల లోపు గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది… మరి ఈ సినిమా జనాలను థియేటర్స్ కి రప్పించి ఆ బిజినెస్ ను రెండు చోట్లా ఎంతవరకు వెనక్కి తీసుకు రాగలుగుతుందో అనేది ఇప్పుడు ఆసక్తి కరం అని చెప్పాలి. తెలుగు లో పోటి కొంచం ఎక్కువగానే ఉన్నా హిట్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ కి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.