బాక్స్ ఆఫీస్ దగ్గర హృతిక్ రోషన్ సైఫ్ అలీ ఖాన్ ల కాంబినేషన్ లో తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విక్రమ్ వేద సినిమాను అదే పేరుతో హిందీ లో రీమేక్ చేయగా సినిమాకి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రివ్యూలు సొంతం అయ్యాయి కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ విషయంలో మాత్రం ఓపెనింగ్స్ తీవ్రంగానే నిరాశ పరిచే విధంగా ఉండటం బాలీవుడ్ కి టోటల్ గా…
మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిన విషయం అని చెప్పాలి. సినిమా కి టాక్ ఎలాగూ పాజిటివ్ గా రావడంతో షో షోకి కలెక్షన్స్ పరంగా సినిమా జోరు చూపిస్తుంది అనుకున్నా కానీ మొత్తం మీద మొదటి రోజు సినిమా ఇండియా లో…
10 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని అందుకుని తీవ్రంగా నిరాశ పరిచింది, హృతిక్ ప్రీవియస్ మూవీ వార్ ఓపెనింగ్స్ లో రికార్డులు సృష్టించింది, కానీ ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ఇలాంటి ఓపెనింగ్స్ ని అందుకోవడం ట్రేడ్ వర్గాలను కూడా విస్మయానికి గురి చేస్తూ ఉండటం విచారకరం అని చెప్పాలి ఇప్పుడు..
మినిమమ్ 15 కోట్ల రేంజ్ లో అయినా ఓపెనింగ్స్ వస్తాయి అనుకుంటే రీసెంట్ టైం లో హృతిక్ కెరీర్ లోవేస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న ఈ సినిమా వీకెండ్ లో పాజిటివ్ టాక్ పవర్ తో గ్రోత్ ని చూపించే అవకాశం ఉందని అందరూ ఆశిస్తున్నారు. మరి సినిమా వీకెండ్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.